Basundi Recipe: స్వీట్ షాపు స్టైల్లో బాసుందిని ఇలా చేయండి.. అమృతం అంతే!

మనం తరచూ తినే స్వీట్స్ లో బాసుంది కూడా ఒకటి. ఈ మధ్య బాసుంది బాగా ఫేమస్ అయ్యింది. దీన్ని వేడిగా అయినా తినవచ్చు.. లేదా కూల్ గా కూడా తినొచ్చు. ఎలా తిన్నా టేస్ట్ మాత్రం అద్భుతం అంతే. స్వీట్స్ అంటే నచ్చని వాళ్లు కూడా కప్పులు కప్పులు లాగించేస్తారు. దీన్ని స్వీట్ షాపు స్టైల్లోనే సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ పదార్థాలతోనే ఈజీగా చేయవచ్చు. ఇందులో పాలు, డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కాబట్టి.. టేస్ట్ మాత్రమే కాదు..

Basundi Recipe: స్వీట్ షాపు స్టైల్లో బాసుందిని ఇలా చేయండి.. అమృతం అంతే!
Basundi
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 24, 2023 | 8:43 PM

మనం తరచూ తినే స్వీట్స్ లో బాసుంది కూడా ఒకటి. ఈ మధ్య బాసుంది బాగా ఫేమస్ అయ్యింది. దీన్ని వేడిగా అయినా తినవచ్చు.. లేదా కూల్ గా కూడా తినొచ్చు. ఎలా తిన్నా టేస్ట్ మాత్రం అద్భుతం అంతే. స్వీట్స్ అంటే నచ్చని వాళ్లు కూడా కప్పులు కప్పులు లాగించేస్తారు. దీన్ని స్వీట్ షాపు స్టైల్లోనే సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ పదార్థాలతోనే ఈజీగా చేయవచ్చు. ఇందులో పాలు, డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కాబట్టి.. టేస్ట్ మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పిల్లలకు ఇస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బలంగా తయారవుతారు. ఎండా కాలంలో చల్లగా, వర్షాకాలం, చలి కాలంలో గోరు వెచ్చగా ఈ స్వీట్ ను తినొచ్చు. ఈ స్వీట్ ను పొయ్యి దగ్గరుండి మరీ చేయాల్సిన పని లేదు. పొయ్యి మీద అలా పెట్టేసి అప్పుడప్పుడూ చూస్తూ మన పని మనం చేసుకోవచ్చు. మరి ఈ స్వీట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

బాసుంది తయారీకి కావాల్సిన పదార్థాలు:

పాలు, డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు, ఎల్లో ఫుడ్ కలర్, యాలకుడి పౌడర్, పంచదార.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ముందుగా పాలను శుభ్రంగా కడిగిన మందపాటి గిన్నె లేదా పాన్ లో వేసుకుని బాగా మరిగించుకోవాలి. సగం పాలు అయిన తర్వాత.. డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు (కుంకుమ పువ్వు ఆప్షన్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు) వేసుకుని కలుపుకుని మరి కొద్ది సేపు మరిగించుకోవాలి. పక్కకు వచ్చిన మీగడను అందులోనూ ఉంచుతూ కలుపుకుంటూ ఉండాలి. మీగడ అంటే నచ్చని వాళ్లు తీసి పక్కకు పెట్టుకోవచ్చు. ఇలా ఓ 10 నిమిషాలు మరిగిన తర్వాత పంచదార, ఫుడ్ కలర్, యాలకుల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడప్పుడు అడుగు అంట కుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా పాలన్నీ చిక్కగా దగ్గరకు అయ్యేంతగా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే హెల్దీ అండ్ టేస్టీ బాసుంది రెడీ. దీన్ని ఇలా వేడిగా ఉన్నప్పుడైనా తినవచ్చు. లేదా ఫ్రిజ్ లో పెట్టకుని చల్ల చల్లగా ఉన్నప్పుడైనా తీసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి