AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bath Benefits: రోజూ స్నానం చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

రోజూ స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికే కాదు శరీరానికి కూడా చాలా లాభాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా. స్నానం చేయడం అంటే కేవలం మన పరిశుభ్రత కోసమే అనుకుంటారు. మరికొంత మంది ఏదో చేశామన్న పేరుకు స్నానం చేస్తూంటారు. స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న బ్యాక్టీరియా, మలినాలు అన్నీ పోతాయి. అంతేకాకుండా మనసు ప్రశాంతంగా, రీ ఫ్రెష్ గా ఉంటుంది. చికాకులు కూడా దూరం అవుతాయి. దీంతో నిద్ర కూడా బాగా పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాత్రి పూట పడుకునే ముందు కూడా స్నానం చేయవచ్చు. గుండెకు ఆరోగ్యంగా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా..

Bath Benefits: రోజూ స్నానం చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?
Bath Benefits
Chinni Enni
|

Updated on: Sep 17, 2023 | 3:02 PM

Share

రోజూ స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికే కాదు శరీరానికి కూడా చాలా లాభాలు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా. స్నానం చేయడం అంటే కేవలం మన పరిశుభ్రత కోసమే అనుకుంటారు. మరికొంత మంది ఏదో చేశామన్న పేరుకు స్నానం చేస్తూంటారు. స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న బ్యాక్టీరియా, మలినాలు అన్నీ పోతాయి. అంతేకాకుండా మనసు ప్రశాంతంగా, రీ ఫ్రెష్ గా ఉంటుంది. చికాకులు కూడా దూరం అవుతాయి. దీంతో నిద్ర కూడా బాగా పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాత్రి పూట పడుకునే ముందు కూడా స్నానం చేయవచ్చు. గుండెకు ఆరోగ్యంగా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఒత్తిడి, ఆందోళనను కూడా దూరం చేసుకోవచ్చు. మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఇంకా రోజూ స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యంగా:

రోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అయితే మరీ వేడి నీటితో స్నానం చేయడ కూడదు. దీని వల్ల హార్ట్ పై నెగిటివ్ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వేడి నీటితో చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

రక్త ప్రసరణ:

రోజూ స్నానం చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగు పడుతుంది. దీంతో చర్మం కూడా మంచి యంగ్ లుక్ గా కనిపిస్తుంది.

చర్మం ఆరోగ్యంగా:

స్నానం చేయడం వల్ల చర్మం కూడా హెల్దీగా ఉంటుంది. చర్మంపై మురికి, డెడ్ స్కిన్ సెల్స్ వంటివి ఏమైనా ఉంటే పోతాయి. స్కిన్ ఫ్రెష్ గా ఉంటుంది. చికాకు, మంట వంటి వాటిని దూరం చేస్తుంది.

కీళ్ల నొప్పులు:

గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల కీళ్ల నొప్పులు ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి. కండరాలు ఉత్తేజితమవుతాయి. అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది.

శ్వాస సమస్యలు:

గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్న వారికి ఉపశమనం లభిస్తుంది. హాట్ వాటర్ ఆవిరి నెమ్మదిగా శ్వాస నాళాల్లోకి వెళ్తాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

నిద్ర బాగా పడుతుంది:

రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది. రిలీఫ్ గా తాజాగా అనిపిస్తుంది. దీంతో నిద్ర పడుతుంది. అయితే భోజనం చేయగానే స్నానం చేయకూడదు. స్నానం చేసిన వెంటనే కూడా భోజనం చేయకూడదు.

ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు:

ఒత్తిడి, ఆందోళన ఉన్న వారు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాడీ వ్యవస్థపై ఒత్తిడి తగ్గి శరీరం రిలాక్స్ అవుతుంది.

రోగ నిరోధక శక్తి:

స్నానం చేయడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల పాజిటివ్ ప్రభావం పడి.. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

మెదడు చురుకుగా పని చేస్తుంది:

స్నానం చేయడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. అంతేకాకుండా జ్ఞాపక శక్తి మెరుగవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్