AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Turmeric Benefits: పసుపును ఇలా వాడితే.. శరీరంలో జరిగే అద్బుతాలు ఇవే!

భారత దేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ గా కనిపించే పదార్థాల్లో పసుపు ఒకటి. అసలు పసుపు వాడని వారు ఉండరు. ప్రతీ రోజూ వంటల్లో పసుపును విరివిగా ఉపయోగిస్తూంటారు. పసుపులో యాంటీ బయోటిక్ గుణాలు, ఔషధ గుణాలు శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతే కాకుండా ఇవి గాయాలు త్వరగా మానడానికి, బ్యాక్టీరియా స్ప్రెడ్ కాకుండా చేస్తాయి. ఆయుర్వేదంలో పసుపుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎన్నో వ్యాధులను నయం చేయడానికి పసుపును ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. పసుపును సరైన విధంగా ఉపయోగిస్తే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా..

Turmeric Benefits: పసుపును ఇలా వాడితే.. శరీరంలో జరిగే అద్బుతాలు ఇవే!
Turmeric Health Benefits
Chinni Enni
|

Updated on: Sep 17, 2023 | 1:10 PM

Share

భారత దేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ గా కనిపించే పదార్థాల్లో పసుపు ఒకటి. అసలు పసుపు వాడని వారు ఉండరు. ప్రతీ రోజూ వంటల్లో పసుపును విరివిగా ఉపయోగిస్తూంటారు. పసుపులో యాంటీ బయోటిక్ గుణాలు, ఔషధ గుణాలు శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతే కాకుండా ఇవి గాయాలు త్వరగా మానడానికి, బ్యాక్టీరియా స్ప్రెడ్ కాకుండా చేస్తాయి. ఆయుర్వేదంలో పసుపుకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎన్నో వ్యాధులను నయం చేయడానికి పసుపును ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. పసుపును సరైన విధంగా ఉపయోగిస్తే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రతత్త పడొచ్చు. అలాగే జలుబు, దగ్గు బాధపడేవారికి కూడా పసుపును ఉపయోగించుకుని.. వాటిని తగ్గించుకోవచ్చు. ఇలా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఆర్థ రైటీస్ వంటి ప్రాబ్లమ్స్ తో బాధ పడేవారికి పసుపు చక్కగా పని చేస్తుంది. అలాగే చర్మ సమస్యలను కూడా కంట్రోల్ చేసే శక్తి పసుపుకు ఉంది. ఇంకా ఈ పసుపుతో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగ నిరోధక శక్తి:

బాడీలో ఇమ్యూనిటీని పెంచే శక్తి పసుపులో ఉంది. పసుపులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ అనారోగ్య సమస్యలను దరి చేరనివ్వకుండా చూస్తుంది. అలాగే వచ్చిన వటితో పోరాడే శక్తిని ఇస్తుంది. ఇన్ ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ ఫ్రీ రాడికల్స్ ను నశింపజేసి.. శరీర అవయవాలు దెబ్బ తినకుండా చేస్తాయి. కాబట్టి తరచూ పసుపును తీసుకోవడం చాలా మంచిది.

ఇవి కూడా చదవండి

గుండె జబ్బులు రావు:

పసుపును క్రమం తప్పకుండా తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. పసుపు రక్త నాళాల్లో ఉన్న అడ్డంకులను తొలగించి.. రక్త ప్రసరణ కూడా సాఫీగా జరిగేలా చేస్తుంది. దీంతో గుండె జబ్బుల బారిన పడకుండా పసుపు హెల్ప్ చేస్తుంది.

జీర్ణ సమస్యలు ఉండవు:

పసుపును వాడటం వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. టర్మరిక్ ను వాడటం వల్ల శరీరంలో జీవక్రియల రేటు మెరుగు పడుతుంది. ఆహారాన్ని త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది పసుపు. దీంతో గ్యాస్, అజీర్తి సమస్యలు తలెత్తవు. ప్రేగుల్లో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా శాతాన్ని పెంచుతుంది.

చర్మ సమస్యలకు:

ఆయుర్వేదంలోనే కాకుండా చర్మానికి సంబంధించిన మెడిసిన్స్ లో కూడా పసుపును విరివిగా ఉపయోగిస్తారు. ఇది మొటిమలకు, మచ్చలకు, నలుపును, చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను తగ్గించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో పసుపు హెల్ప్ చేస్తుంది.

క్యాన్సర్ నుంచి కాపాడుతుంది:

క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా పసుపు కాపాడుతుంది. క్యాన్సర్ కణాలను నశింపచేసే శక్తి కూడా పసుసుకు ఉంది.

కాలేయాన్ని శుభ్ర పరుస్తుంది:

పసుపు కాలేయంలోని వ్యర్థాలను, మలినాలను బయటకు పంపేస్తుంది. దీంతో కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

బరువు తగ్గొచ్చు:

పసుపును తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గొచ్చు. పసుపుతో చేసిన వంటలు తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో వేరే ఆహారం తీసుకోకుండా ఉంటాం. ఈ విధంగా కూడా పసుపు బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో
ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి