AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Antibiotic Tablets: యాంటీ బయోటిక్స్ ని వాడుతున్నారా.. అయితే ఈ టిప్స్ ని పాటించండి!

సాధారణంగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. దీంతో డాక్టర్ని సంప్రదిస్తే.. యాంటీ బయోటిక్స్ ని ప్రిఫర్ చేస్తారు. ఈ యాంటీ బయోటిక్స్ చెడు బ్యాక్టీరియాను నశింప చేసి.. ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కానీ యాంటీ బయోటిక్స్ మంచివే కదా అని మీకు మీరే వాటిని ఎప్పుడూ నేరుగా వేసుకోకూడదు. వైద్యుల సలాహాలు, సూచనల ప్రకారమే వాడాలి. ఈ యాంటీ బయోటిక్స్ వాడితే కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. కడుపులో..

Antibiotic Tablets: యాంటీ బయోటిక్స్ ని వాడుతున్నారా.. అయితే ఈ టిప్స్ ని పాటించండి!
Antibiotics Tabs
Chinni Enni
| Edited By: |

Updated on: Sep 18, 2023 | 7:30 PM

Share

సాధారణంగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. దీంతో డాక్టర్ని సంప్రదిస్తే.. యాంటీ బయోటిక్స్ ని ప్రిఫర్ చేస్తారు. ఈ యాంటీ బయోటిక్స్ చెడు బ్యాక్టీరియాను నశింప చేసి.. ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కానీ యాంటీ బయోటిక్స్ మంచివే కదా అని మీకు మీరే వాటిని ఎప్పుడూ నేరుగా వేసుకోకూడదు. వైద్యుల సలాహాలు, సూచనల ప్రకారమే వాడాలి. ఈ యాంటీ బయోటిక్స్ వాడితే కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. కడుపులో నొప్పి, వికారం, అతిసారం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇలాంటప్పుడు మీరు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనవలసిందే. యాంటీ బయోటిక్స్ తీసుకున్నప్పుడు తేలికైనా ఆహారాన్ని తీసుకోవాలి.

తొందరగా జీర్ణం అయ్యే ఆహారం:

యాంటీ బయోటిక్స్ వాడుతున్నప్పుడు తేలికైన, త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అలాగే బాగా ఉడికిన, వేడిగా ఉన్న ఆహారాన్నే తీసుకోవాలి. దీంతో జీర్ణ క్రియ కూడా సాఫీగా అవుతుందని చెబుతున్నారు నిపుణులు. కిచిడీ, సాంబార్ రైస్, రసంతో అన్నం లాంటివి తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మజ్జిగ తీసుకోవాలి:

యాంటీ బయోటిక్స్ వాడుతున్నప్పుడు బాడీలో హీట్ విడుదల అవుతుంది. కాబట్టి మజ్జిగ తీసుకుంటూ ఉంటే ఆ వేడి అనేది తగ్గుతుంది. పల్చగా మజ్జిగ చేసుకుని అందులో ఉప్పు, చిటికెడు వేయించిన జీలకర్ర పొడిని వేసుకుని తాగితే లా బెటర్. తిన్న ఆహారాన్ని కూడా ఇది త్వరగా జీర్ణం చేస్తుంది.

సూప్ లు తాగండి:

అనారోగ్యంగా ఉన్నప్పుడు అన్నం వంటివి తినాలనిపించదు. దీంతో సూప్ లు లాంటివి తీసుకోవచ్చు. ఇవి చాలా త్వరగా జీర్ణం అవుతాయి. కాబట్టి ఇంట్లోనే పెసర పప్పు సూప్, వెజిటేబుల్ సూప్స్, గంజి సూప్ వంటివి తీసుకుంటో ఆరోగ్యంతో పాటు ఈజీగా కూడా ఉంటుంది.

నీళ్లు ఎక్కువగా తాగాలి:

ఆరోగ్యం బాగోలేనప్పుడు నీరసంగా ఉంటుంది. దీంతో బాడీ డీ హైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తగిన విధంగా నీటిని తీసుకోవాలి. అలాగే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది. ఇన్ ఫెక్షన్లతో పోరాడటానికి హెల్ప్ చేస్తుంది.

ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి:

యాంటీ బయోటిక్స్ వేసుకునేటప్పుడు ఎక్కువగా ఆకలి వేయదు. ఎందుకంటే ఇవి ఆకలి వేయనివ్వదు. కాబట్టి ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
పూజ గదిలో దేవతల విగ్రహాలను ఎలా అమర్చాలి? గణపతికి ఏ స్థానం ఇవ్వాలి
పూజ గదిలో దేవతల విగ్రహాలను ఎలా అమర్చాలి? గణపతికి ఏ స్థానం ఇవ్వాలి
అడవి పంది స్కిల్స్ అమేజింగ్ అంతే..
అడవి పంది స్కిల్స్ అమేజింగ్ అంతే..
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా..? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే
రాహువు కటాక్షం.. ఈ రాశులకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు..!
రాహువు కటాక్షం.. ఈ రాశులకు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు..!
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ప్రభుత్వ బడి టీచర్లకు పండగే
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
కేరళలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ..OTTలో మెంటలెక్కిస్తోన్న సినిమా
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
అయ్యో.. ఇలాంటోళ్ల మధ్యనా మనం బతుకుతున్నాం..? వృద్ధురాలి నగలపై..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీ జీతంతో TGPSC మరో నోటిఫికేషన్‌
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
వాషింగ్ మెషీన్ కొనేముందు వీటి మధ్య తేడా ఏంటో తెలుసుకోండి..
అదృష్టం అంటే మీదే భయ్యా..! ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు
అదృష్టం అంటే మీదే భయ్యా..! ఈ రాశుల వారికి ఇక తిరుగుండదు