Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Ganesh Idols: మనం తినే ఆహారాలతోనే బొజ్జ గణపయ్యను ఇలా తయారు చేయండి.. యూనిక్ గా ఉంటుంది!

ప్రతీ ఏడాది వినాయక చవితి వచ్చిందంటే వీధిలో పిల్లలు, పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. పెద్ద పెద్ద నగరాల్లో అయితే వినాయక చవితిని ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తారు. అందరూ ఒక చోట చేరి సంబరాలను చేస్తారు. డ్యాన్స్ లు, పాటలతో హోరెత్తిస్తారు. ఇలా చేయడం వల్ల అందరూ కలిసినట్టుగా కూడా ఉంటుంది. ఇక ఎదుటి వారి బొజ్జ గణపయ్య కంటే మనదే బాగుండాలని ఎంతో ఖర్చు పెట్టి గణపయ్యను కొంటూంటారు. మరి కొందరు షరా మామూలే మట్టి గణేష్ తో పూజ చేస్తూంటారు. ఇంకొందరు మాత్రం కేవలం మాదే హైలెట్ అవ్వాలని వేరే వేరే వస్తువులను ఉపయోగించి..

Unique Ganesh Idols: మనం తినే ఆహారాలతోనే బొజ్జ గణపయ్యను ఇలా తయారు చేయండి.. యూనిక్ గా ఉంటుంది!
Ganesh
Follow us
Chinni Enni

|

Updated on: Sep 16, 2023 | 8:14 PM

ప్రతీ ఏడాది వినాయక చవితి వచ్చిందంటే వీధిలో పిల్లలు, పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతా ఉండదు. పెద్ద పెద్ద నగరాల్లో అయితే వినాయక చవితిని ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తారు. అందరూ ఒక చోట చేరి సంబరాలను చేస్తారు. డ్యాన్స్ లు, పాటలతో హోరెత్తిస్తారు. ఇలా చేయడం వల్ల అందరూ కలిసినట్టుగా కూడా ఉంటుంది. ఇక ఎదుటి వారి బొజ్జ గణపయ్య కంటే మనదే బాగుండాలని ఎంతో ఖర్చు పెట్టి గణపయ్యను కొంటూంటారు. మరి కొందరు షరా మామూలే మట్టి గణేష్ తో పూజ చేస్తూంటారు. ఇంకొందరు మాత్రం కేవలం మాదే హైలెట్ అవ్వాలని వేరే వేరే వస్తువులను ఉపయోగించి వినాయకుడిని చేస్తారు. అయితే మనం తినే ఆహారాలతో కూడా గణపయ్యను చేసుకోవచ్చు. మరి ఏయే పదార్థాలతో వినాయకుడిని తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్రూట్స్:

మనకు లభ్యమయ్యే వివిధ రకాల ఫ్రూట్స్ తో మనం బొజ్జ గణపయ్యను తాయరు చేసుకోవచ్చు. యాపిల్స్, ద్రాక్ష, దానిమ్మ గింజలు, మొక్క జొన్న, పుచ్చకాయ, కర్భూజా, అరటి పండు వంటి రకరకాల పండ్లతో వినాయకుడిని తయారు చేసుకోవచ్చు. ఇలా చేయడానికి కాస్త సమయం పట్టినా.. యూనిక్ గా మాత్రం ఉంటుంది. అలాగే నిమజ్జనం చేయడానికి కూడా వీలుగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

చాక్లెట్స్:

చాక్లెట్స్ తో కూడా మనం గణేష్ ను తయారు చేసుకోవచ్చు. చిన్న రూపాయి చాక్లెట్ దగ్గర్నుంచి ఖరీదైన చాక్లెట్లతో కూడా మనం గణపయ్యను చేయవచ్చు. వినాయకుడిని షేప్ ఒకటి తీసుకుని.. అందులో కరిగించిన చాక్లెట్ ను పోసి కూడా రెడీ చేయవచ్చు. ఇలా అయితే అందరికీ ఈజీగా కూడా ఉంటుంది.

డ్రై ఫ్రూట్స్:

మనకు అందుబాటులో ఉండే డ్రై ఫ్రూట్స్ పిస్తా, కిస్మిస్, జీడి పప్పు, బాదం ఇలా మనకు నచ్చిన వాటితో చేసుకోవచ్చు. పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా సీడ్స్ తో కూడా మనం గణేష్ చేయవచ్చు. ఇలాంటివి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి.

కొబ్బరి ముక్కలు లేదా చిప్పలు:

కొబ్బరి ముక్కలు లేదా చిప్పలతో కూడా మనం వినాయకుడిని తయారు చేయవచ్చు. ఇలా తయారు చేసినవి చెక్కు చెదరకుండా ఉంటాయి. అవసరమైతే పూజ అయిపోయాక మనం వాటిని డెకరేటీవ్ ఐటెమ్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. కాస్త ఐడియాలు ఉండాలే కానీ.. వినాయకుడిని తయారు చేయడం చాలా ఈజీ. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇలాంటివి వారికి ఆసక్తిగా మారతాయి. వారు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.