Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dussehra 2023: బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.. దసరాకు రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో పాజిటిల్ రెస్పాన్స్ అందుకుంది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం. ఇక ఇప్పుడు సినీ ప్రియుల అందరి దృష్టి దసరా సినిమాలపై పడింది. అక్టోబర్ మూడో వారంలో ఒకటి కాదు రెండు కాదు.. మూడు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. దళపతి విజయ్, నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ దసరాకు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. మరీ ఎవరెవరి చిత్రాలు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో చూద్దామా.

Dussehra 2023: బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.. దసరాకు రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే..
Raviteja, Vijay, Balakrishn
Follow us
Rajitha Chanti

| Edited By: TV9 Telugu

Updated on: Oct 05, 2023 | 1:05 PM

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద జవాన్ చిత్రం రికార్డ్స్‏తో దూసుకుపోతుంది. విడుదలైన ఏడు రోజుల్లోనే దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ వీకెండ్ జవానా కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పాజిటిల్ రెస్పాన్స్ అందుకుంది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం. ఇక ఇప్పుడు సినీ ప్రియుల అందరి దృష్టి దసరా సినిమాలపై పడింది. అక్టోబర్ మూడో వారంలో ఒకటి కాదు రెండు కాదు.. మూడు భారీ చిత్రాలు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. దళపతి విజయ్, నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ దసరాకు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. మరీ ఎవరెవరి చిత్రాలు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయో చూద్దామా.

మాస్ మాహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం టైగర్ నాగేశ్వర రావు. 1970ల నాటి నేపథ్యంలో సాగే స్టూవర్టుపురం దొంగ, బందిపోటు టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని సినిమాగా తీసుకువస్తున్నారు. ఇందులో టైటిల్ పాత్రలో రవితేజ పోషిస్తున్నారు. ఇందులో నూపూర్ సనన్, అనుపమ్ ఖేర్, గాయత్రి భరద్వాజ్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ముందుగా ఈ సినమాను సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అక్టోబర్ 20న విడుదల చేయనున్నారు చిత్ర నిర్మాతలు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు.

అలాగే నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న చిత్రం భగవంత్ కేసరి. కాజల్, శ్రీలీల కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు. యాక్షన కామెడీ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, ప్రియాంక జవాల్కర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇక కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్రలో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం లియో. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, త్రిష, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియా ఆనంద్, మాథ్యూ థామస్ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు. దీంతో ఈసారి దసరాకు ఈ ముగ్గురి స్టార్ హీరోలకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఉండనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చూడటానికి ఎంత పద్ధతిగా ఉందో కదా.. కానీ రెడ్‌హ్యాండెడ్‌ బుక్
చూడటానికి ఎంత పద్ధతిగా ఉందో కదా.. కానీ రెడ్‌హ్యాండెడ్‌ బుక్
Video: ధోని నో లుక్ అండర్ ఆర్మ్ త్రో రన్ ఔట్ వీడియో చూశారా?
Video: ధోని నో లుక్ అండర్ ఆర్మ్ త్రో రన్ ఔట్ వీడియో చూశారా?
ఓవర్‌టేక్‌ చేయబోయాడు..కట్‌చేస్తే రోడ్డుపై పల్టీలు కొట్టాడు!
ఓవర్‌టేక్‌ చేయబోయాడు..కట్‌చేస్తే రోడ్డుపై పల్టీలు కొట్టాడు!
పరమేశ్వరుడికి ప్రీతికరం.. ఔషధాల్లో ఘనం.. ఎన్ని ఉపయోగాలో తెలుసా
పరమేశ్వరుడికి ప్రీతికరం.. ఔషధాల్లో ఘనం.. ఎన్ని ఉపయోగాలో తెలుసా
ఎవర్రా సామీ నువ్వు.. ఏడాదిలో ఇన్నిసార్లు ఎలా భయ్యా
ఎవర్రా సామీ నువ్వు.. ఏడాదిలో ఇన్నిసార్లు ఎలా భయ్యా
ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి..
ఆ రోజు నాకు ఫస్ట్ టైమ్ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి..
పెరుగుతో హెయిర్ మాస్క్.. ఇలా వాడితే ఇబ్బందులు తప్పవు!
పెరుగుతో హెయిర్ మాస్క్.. ఇలా వాడితే ఇబ్బందులు తప్పవు!
హిల్ స్టేషన్స్‌లో హాయిగా.. తక్కువ బడ్జెట్లో ఇలా ప్లాన్ చేసుకోండి
హిల్ స్టేషన్స్‌లో హాయిగా.. తక్కువ బడ్జెట్లో ఇలా ప్లాన్ చేసుకోండి
SLBCలో చివరికి దశకు రెస్క్యూ ఆపరేషన్.. ఇంకాస్త తవ్వితే...
SLBCలో చివరికి దశకు రెస్క్యూ ఆపరేషన్.. ఇంకాస్త తవ్వితే...
ఇదేందయ్యా ఇదీ.. నిందితుడిని వదిలి జడ్జి కోసం గాలింపు..! ఆ తర్వాత
ఇదేందయ్యా ఇదీ.. నిందితుడిని వదిలి జడ్జి కోసం గాలింపు..! ఆ తర్వాత