Sai Pallavi: నార్త్ లో మాయ చేయనున్న సౌత్ భామ.. కొడితే కుంభస్థలమే అన్నట్టుగా స్టార్ హీరో కొడుకు సరసన..
తెలుగులో సినిమా చేయక ఏడాది దాటింది.. కొత్త సినిమా ఏదో కూడా చెప్పడం లేదు.. తమిళంలో ఒకే ఒక్క సినిమా చేస్తున్నారు.. అంతలోనే చలో ముంబై అంటున్నారు. సౌత్ లో నటించిన ఆ బ్యూటీ.. నార్త్ లో మాయ చేయడానికి వెళుతున్నారు. కొడితే కుంభస్థలమే అన్నట్టు ఏకంగా స్టార్ హీరో కొడుకు సినిమాలోనే నటించబోతున్నారు. ఇంతకీ ఆ బంపర్ ఆఫర్ కొట్టేసిన హీరోయిన్ ఎవరు.. ఏంటా కథ..? కొంతమంది హీరోయిన్లను ఒక ఇండస్ట్రీకి పరిమితం చేయలేము. సాయి పల్లవి కూడా అదే కోవలోకి వస్తుంది. చేసింది తక్కువ సినిమాలైనా సౌత్ లో ఈమె ఫాలోయింగ్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు.