- Telugu News Photo Gallery Cinema photos Mani Ratnam to make another historical movie after Ponniyin Selvan know who is the Hero
Mani Ratnam: మరో హిస్టారికల్ మూవీతో ప్రజల ముందుకు తీసుకు రానున్న మణిరత్నం.. హీరో ఎవరంటే ??
మణిరత్నం దర్శకత్వంలో ఘన విజయం సాధించిన భారీ హిస్టారికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో ఇప్పుడు ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ ఆధారంగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఓ స్టార్ హీరోతో చోళ కథను చెప్పేందుకు రెడీ అవుతున్నారు. పొన్నియిన్ సెల్వన్ సినిమాలో టైటిల్ రోల్ జయం రవిదే అయినా... విక్రమ్, కార్తి క్యారెక్టర్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ దక్కినట్టుగా అనిపించింది.స్క్రీన్ స్పేస్ పరంగా కూడా విక్రమ్, కార్తిలే ఎక్కువ సేపు తెర మీద కనిపించారు.
Updated on: Sep 15, 2023 | 9:51 PM

మణిరత్నం దర్శకత్వంలో ఘన విజయం సాధించిన భారీ హిస్టారికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్. రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో ఇప్పుడు ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ ఆధారంగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఓ స్టార్ హీరోతో చోళ కథను చెప్పేందుకు రెడీ అవుతున్నారు.

పొన్నియిన్ సెల్వన్ సినిమాలో టైటిల్ రోల్ జయం రవిదే అయినా... విక్రమ్, కార్తి క్యారెక్టర్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ దక్కినట్టుగా అనిపించింది. స్క్రీన్ స్పేస్ పరంగా కూడా విక్రమ్, కార్తిలే ఎక్కువ సేపు తెర మీద కనిపించారు. దీంతో అసలు హీరో క్యారెక్టర్ పూర్తిగా ఆడియన్స్‌కు కనెక్ట్ కాలేదు. ఈ లోటును తీర్చేందుకు రెడీ అవుతున్నారు తమిళ మేకర్స్.

కేవలం పొన్నియిన్ సెల్వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చోళుల కథను వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. రాజ రాజ చోళన్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోలీవుడ్ టాప్ హీరో అజిత్ టైటిల్ రోల్‌లో నటించబోతున్నారు.

పొన్నియిన్ సెల్వన్ సినిమాను నవల ఆధారంగా తెరకెక్కించారు. కానీ అజిత్ సినిమాను మాత్రం గతంలో శివాజీ గణేషణ్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన రాజ రాజ చోళన్ సినిమాకు రీమేక్‌గా రూపొందించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ కథకు ఓకే చెప్పిన తల... ఫుల్ స్క్రీప్ట్ విన్న తరువాత ఫైనల్ డెసిషన్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు.

అజిత్ హిస్టారికల్ మూవీకి విష్ణు వర్దన్ దర్శకత్వం వహించబోతున్నారు. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన బిల్లా, ఆరంభం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆ రెండు సినిమాలు స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్లుగా రూపొందాయి. కానీ ఈ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీని మాత్రం హిస్టారికల్ జానర్‌లో ప్లాన్ చేస్తున్నారు.




