- Telugu News Photo Gallery Cinema photos Trivikram Srinivas may take Anirudh Ravichander as music director for his next movie with Allu Arjun
Trivikram: త్రివిక్రమ్‌కు తమన్ బోర్ కొట్టేసారా ?? గురూజీ సెలెక్ట్ చేయబోయే నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ??
త్రివిక్రమ్‌కు తమన్ బోర్ కొట్టేసారా..? వరసగా మూడు సినిమాలు చేయగానే రొటీన్ ఫీల్ అవుతున్నారా..? అప్పట్లో దేవీ శ్రీ ప్రసాద్‌కు బై చెప్పినట్లే.. తమన్‌కూ బైబై చెప్పబోతున్నారా..? మరి త్రివిక్రమ్ దృష్టిలో పడ్డ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు..? నెక్ట్స్ బన్నీతో చేయబోయే సినిమాకు ఎవరు సంగీతం అందించనున్నారు..? త్రివిక్రమ్ సినిమా అంటే థమన్ సంగీతం అని ఫిక్సైపోయారు ప్రేక్షకులు. ఒకసారి కనెక్ట్ అయితే.. వాళ్లతోనే కనీసం మూడు సినిమాలైనా జర్నీ చేస్తుంటారు గురూజీ. అందుకే హీరోలు మారినా.. హీరోయిన్స్, సంగీత దర్శకులను మార్చరు మాటల మాంత్రికుడు.
Updated on: Sep 15, 2023 | 9:37 PM

త్రివిక్రమ్‌కు తమన్ బోర్ కొట్టేసారా..? వరసగా మూడు సినిమాలు చేయగానే రొటీన్ ఫీల్ అవుతున్నారా..? అప్పట్లో దేవీ శ్రీ ప్రసాద్‌కు బై చెప్పినట్లే.. తమన్‌కూ బైబై చెప్పబోతున్నారా..? మరి త్రివిక్రమ్ దృష్టిలో పడ్డ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు..? నెక్ట్స్ బన్నీతో చేయబోయే సినిమాకు ఎవరు సంగీతం అందించనున్నారు..?

త్రివిక్రమ్ సినిమా అంటే థమన్ సంగీతం అని ఫిక్సైపోయారు ప్రేక్షకులు. ఒకసారి కనెక్ట్ అయితే.. వాళ్లతోనే కనీసం మూడు సినిమాలైనా జర్నీ చేస్తుంటారు గురూజీ. అందుకే హీరోలు మారినా.. హీరోయిన్స్, సంగీత దర్శకులను మార్చరు మాటల మాంత్రికుడు. దేవీ శ్రీ ప్రసాద్ తర్వాత తమన్‌తో అలాగే కనెక్ట్ అయ్యారీయన.

కెరీర్ మొదట్లో మణిశర్మతో అతడు, ఖలేజా సినిమాలు చేసినా.. ఆ తర్వాత జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు దేవీతో చేసారు త్రివిక్రమ్. అజ్ఞాతవాసికి అనిరుధ్‌ను తీసుకున్న ఈయన.. అరవింద సమేత నుంచి థమన్‌తో కనెక్ట్ అయ్యారు. నిజానికి అరవింత సమేతకు అనిరుధ్ అనుకున్నా కుదర్లేదు.

అరవింద సమేత, అల వైకుంఠపురములో, గుంటూరు కారం వరకు థమన్‌నే తీసుకున్నారు గురూజీ. అయితే నెక్ట్స్ చేయబోయే అల్లు అర్జున్ ప్రాజెక్ట్‌కు తమన్ కాకుండా అనిరుధ్‌ను తీసుకోవాలని చూస్తున్నారు గురూజీ. ఈ మేరకు ఇప్పటికే బన్నీ క్లారిటీ ఇచ్చేసారు. దాంతో ఈ కాంబో దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది.

జవాన్ టీంకి కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్ చేసారు బన్నీ. దానికి అనిరుధ్ థ్యాంక్యూ అంటూ రిప్లై ఇచ్చారు. థ్యాంక్యూ సరిపోదని.. తనకూ మంచి పాటలివ్వాలని కోరారు అల్లు అర్జున్. అంటే త్రివిక్రమ్, బన్నీ సినిమాకి అనిరుధ్ లైన్‌లోకి వచ్చారని అర్థమవుతుంది. 2024లోనే బన్నీ, త్రివిక్రమ్ నాలుగో సినిమా మొదలు కానుంది.




