Ganesh Chaturthi: మట్టి గణేష్ మహారాజ్‌కీ అంటున్న చెవిరెడ్డి.. లక్షా 15 వేల విగ్రహాల పంపిణీ..
వినాయక చవితి పండుగ కోసం చంద్రగిరి నియోజకవర్గంలో లక్ష మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు చెవిరెడ్డి. టీటీడీ ఈవో ధర్మారెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు నుంచి వాహనాల్లో చంద్రగిరి నియోజకవర్గం నలుమూలలకు మట్టి వినాయకుళ్లను తరలించారు.. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి పంచాయతీకి 10 పెద్ద విగ్రహాలను వీధుల్లో నెలకొల్పేందుకు అందిస్తున్నామన్నారు చెవిరెడ్డి.
జై బోలో మట్టి గణేష్ మహారాజ్‌కీ అంటున్నారు చెవిరెడ్డి. మట్టి గణేశుడే గట్టి గణేశుడు అంటున్నారు ఆయన. చంద్రగిరి నియోజకవర్గంలో లక్ష మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చెవిరెడ్డి. మట్టి గణపతే మహా గణపతి అంటున్నారు ఏపీ ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి. మట్టి వినాయకుడితో భక్తికి భక్తి…కాలుష్యం నుంచి విముక్తి ఉంటాయంటున్నారు చెవిరెడ్డి. వినాయక చవితి పండుగ కోసం చంద్రగిరి నియోజకవర్గంలో లక్ష మట్టి వినాయక విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఆయన. టీటీడీ ఈవో ధర్మారెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించారు. తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు నుంచి వాహనాల్లో చంద్రగిరి నియోజకవర్గం నలుమూలలకు మట్టి వినాయకుళ్లను తరలించారు.
చంద్రగిరి నియోకవర్గంలోని అన్ని మండలాల్లోని ప్రతి గ్రామానికి ట్రాక్టర్లలో విగ్రహాల తరలింపును జెండా ఊపి ప్రారంభించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మట్టి గణపతులను చేయించడం ద్వారా 430మంది కుమ్మరులకు ఉపాధి కలిగిందన్నారు చెవిరెడ్డి. మొత్తం లక్షా 15 వేల చిన్న మట్టి విగ్రహాలను తయారు చేయించామని ఆయన తెలిపారు. 1060 పెద్ద విగ్రహాలను తయారు చేయించామన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి పంచాయతీకి 10 పెద్ద విగ్రహాలను వీధుల్లో నెలకొల్పేందుకు అందిస్తున్నామన్నారు చెవిరెడ్డి. ఇక ప్రతి హిందువు భక్తితో వినాయకచవితి పండుగను జరుపుకుంటే హిందూ ధర్మం పెంపొందుతుందన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి.
ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే లక్షా 15 వేల వినాయక విగ్రహాలు తయారు చేయించి, ప్రజలకు పంపిణీ చేయడం సామాన్యమైన విషయం కాదన్నారు ధర్మారెడ్డి. ఇలా చేయడం ద్వారా దేశంలోనే చంద్రగిరి ప్రత్యేక స్థానం సంపాదించిందన్నారు ఆయన. ఇలాంటి కార్యక్రమం దేశంలో ఏ ఒక్కరూ చేయలేరు…అది కేవలం చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మాత్రమే సాధ్యమంటూ ఆయనపై టీటీడీ ఈవో ప్రశంసలు కురిపించారు. ధర్మో రక్షతి రక్షితః అన్నట్లు హిందూ ధర్మాన్ని పెంచి పోషిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డికి వినాయక స్వామి ఆశీస్సులు ఉండాలని టీటీడీ ఈవో కోరుకున్నారు. భక్తుల ఆనందోత్సాహాల నడుమ ఈ కార్యక్రమం కన్నులపండువగా సాగింది. పెద్దఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..