Pawan Kalyan: ‘ప్రజాగ్రహం తట్టుకోలేవు’.. సీఎం జగన్ పై పవన్ ఘాటు వ్యాఖ్యలు
సీఎం జగన్ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న కొందరి అధికారులపై పవన్ సంచలన కామెంట్స్ చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి కొందరు అధికారులు కులాన్ని మోస్తున్నారని ఆరోపించారు. కులమా.. రాజ్యాంగమా అధికారులు తేల్చుకోవాలని.. కులాలు, పార్టీలకు కొమ్ముకోసేవారికి సిగ్గుండాలన్నారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం అంటే ప్రజలకు ట్రస్టీ అని, మంత్రుల కంటే కాస్త ఎక్కువ అధికారాలు మాత్రమే ఉంటాయన్నారు. సీఎం తనను తానే ఎక్కువగా ఊహించుకుంటున్నారని, జనాగ్రహం చూస్తే తట్టుకోలేవన్నారు. పదేళ్లుగా జనసేన పార్టీని నడుపుతున్న వ్యక్తిగా.. దయచేసి తనను నమ్మాలన్నారు పవన్ కల్యాణ్. జనసేన అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజున ఏపీ దిశ దశ మారుతుందని హామీ ఇచ్చారు. జనసేన కేవలం అసెంబ్లీలోకే కాకుండా.. పార్లమెంటుకు కూడా వెళ్లాలని, అందుకోసం టీడీపీతో కలిసి పనిచేద్దామన్నారు. టీడీపీతో పొత్తుపై త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు వివరిస్తానన్నారు పవన్‌కల్యాణ్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Sep 16, 2023 09:17 PM
వైరల్ వీడియోలు
Latest Videos