- Telugu News Photo Gallery Spiritual photos Vastu Tips: If a Peepal tree grows in the house, don’t ignore it; Be careful in time, otherwise it will not take time to break the house
Vastu Tips: ఇంట్లో రావి చెట్టు పెరిగితే నిర్లక్ష్యం చేయకండి.. కుటుంబ పరిస్థితిపై ప్రభావం.. ఏ రోజున మొక్క తీయాలంటే
తాము ఉన్నత స్థితిలో బతకాలనే ఎవరైనా రోజూ కష్టపడతారు. ఒకొక్కసారి శక్తికి మించి కష్టపడినా అందుకు తగిన ఫలితం ఉండడు. పురోభివృద్ధి కూడా ఉండదు. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిల్లో ఒకటి ఇంట్లోని వాస్తు నియమాలు. ఇంటి లోపల మాత్రమే కాదు ఆవరణలో పెరిగే మొక్కలు కూడా వాస్తు దోషాలకు కారణం కావచ్చు. ఇలాంటి వాస్తు దోషాన్ని కలిగించే చెట్లల్లో రావి చెట్టుకూడా ఉంది.
Updated on: Sep 15, 2023 | 1:24 PM

హిందూమతంలో రావి చెట్టు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది . బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ రావి చెట్టులో నివసిస్తారని విశ్వాసం. ఈ చెట్టు గురించి పురాణ గ్రంథాలలో అనేక నియమాలు పేర్కొనబడ్డాయి. రావి చెట్టు ఎక్కడైనా పెరుగుతుంది. నేల మీద మాత్రమే కాదు ఇంటి గోడలు, పైకప్పులో కూడా పెరుగుతుంది. ఆ చెట్టుని ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటారు. వాస్తవానికి ఇంట్లో రావి చెట్టు పెరగడం వాస్తు ప్రకారం అశుభం.

రావి చెట్టులో దేవతలు నివసిస్తారని నమ్మకంతో ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో రావి చెట్టు ఉండటం సరైనది కాదు. ఇంట్లో ఈ చెట్టును పెంచడం అశుభం. కనుక ఇంట్లో ఈ చెట్టు పెరుగుతుంటే వెంటనే దానిని తొలగించండి.

సాధారణంగా రావి చెట్టు ఇంటి పైకప్పుపై లేదా గోడకు మద్దతుగా పెరుగుతుంది. ఈ చెట్టుని ఎన్ని సార్లు తీసినా పదే పదే పెరుగుతూ ఉంటే ఈ సింపుల్ టిప్స్ ని పాటించండి. కొంచెం పెరిగిన తర్వాత ఆ చెట్టుని మట్టితో సమానంగా అక్కడ నుంచి తొలగించి దానిని వేరే ప్రాంతంలో , దేవాలయంలో లేదా రోడ్డు పక్కన నాటండి.

ఇంట్లో రావి చెట్టు ఉండటం వల్ల ఇంటి సభ్యులకు పురోగతి ఉండదు. ప్రతిరోజూ కొత్త సమస్యలను సృష్టిస్తుంది. అయితే పింపల్ చెట్టును నరికివేయకూడదు.. అలా చేయడం అశుభం. దానిని తవ్వి వేరే ప్రాంతంలో నాటాలి. ఒకవేళ తప్పని సరి పరిస్థితుల్లో రావి చెట్టుని నరకాల్సి వస్తే.. పూజానంతరం ఆదివారం రోజున మాత్రమే కట్ చేయాలి .

మీ ఇంట్లో రావి చెట్టు తరచుగా పెరుగుతూ ఉంటే.. 45 రోజుల పాటు ఆ చెట్టును పూజించి.. పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించండి. 45 రోజుల తర్వాత రావి మొక్కను దాని మూలాలతో తీసి మరొక ప్రదేశంలో నాటండి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు ఉండవు.





























