- Telugu News Photo Gallery Spiritual photos Ganesh chaturthi 2023 celebration across india like delhi, mumbai,hyderabad
Ganesh Chaturthi 2023: దేశ వ్యాప్తంగా మొదలైన వినాయక చవితి సందడి.. మండపాల్లో కొలువుదీరుతున్న గణపయ్యలు
హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగళ్లలో ఒకటి వినాయక చవితి. పిల్లల పండగగా పేరుగాంచిన పెద్దలు కూడా ఈ నవరాత్రుల్లో పిల్లలవుతారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రుల సందడి మొదలైంది. 10 రోజుల పాటు జరుపుకునే నవరాత్రుల కోసం మండపాలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 18 వినాయక చవితితో నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రులను ఎలా జరుపుకుంటారో చూద్దాం..
Updated on: Sep 15, 2023 | 2:41 PM

గణపయ్య పుట్టిన రోజుని వినాయక చవితిగా జరుపుకుంటారు. ఇప్పటికే వినాయక చవితి పండగ సందడి మొదలైంది. 10 రోజుల పాటు జరిగే గణేష్ చతుర్థి పండుగ సెప్టెంబర్ 18 నుండి ప్రారంభమవుతుంది. గణపయ్య నిమజ్జనంతో ముగుస్తుంది.

ఢిల్లీ: రాజధాని ఢిల్లీలో కూడా గణేష్ చతుర్థి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఉత్సవాల సందర్భంగా గణపతి మండపాలను చాలా అందంగా అలంకరించారు. గణేష్ నిమజ్జనం సమయంలో కనిపించే దృశ్యాలు చూడదగినవి

మహారాష్ట్ర: గణేష్ చతుర్థి సందర్భంగా మహారాష్ట్రలో ముఖ్యడంగా ముంబై నగరమంతా సందడి నెలకొంది. నగరంలోని అన్ని పండాల్లో గణపతి విగ్రహాలను అలంకరించారు. మీరు కనుక ముంబైకి వెళుతున్నట్లయితే, లాల్‌బౌగ్చా రాజా, ఖేత్వాడి గంరాజ్, గణేష్ గాలి ముంబయిచా రాజా వంటి అద్భుతమైన మండపాలు సందర్శించడానికి బాగుంటాయి.

గోవా: మహారాష్ట్ర మాదిరిగానే పొరుగు రాష్ట్రమైన గోవాలో కూడా గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుకుంటారు. గోవాలోని మార్సెయిల్, మపుసా అనే రెండు ప్రధాన ప్రదేశాలతో పాటు అనేక దేవాలయాల్లో గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుకుంటారు. ఈ సమయంలో విదేశీ పర్యాటకులు కూడా వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటారు.

హైదరాబాద్: గణేష్ చతుర్థిని ఢిల్లీ-ముంబైలోనే కాకుండా దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా ఘనంగా జరుపుకుంటారు. హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో భారీ విగ్రహాలు కొలువుదీరతాయి. ఇప్పటికే వీధి వీధినా గణపతి మండపాలను ఏర్పాటు చేశారు.





























