Chicken Benefits and Side effects: రోజూ చికెన్ తింటే లాభామా? నష్టమా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి!
చికెన్ అంటే చాలా మందికి ప్రాణం. ముక్క లేనిదే ముద్ద తిగదు. ఏ సెలబ్రేషన్స్ లో అయినా ఉండే కామన్ ఐటెమ్ చికెన్. ధర తక్కువతో పాటు మంచి టేస్టీగా కూడా ఉంటుంది. అందులోనూ చికెన్ లో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది బాడీకి ఎలాంటి హానీ చేయదు. కేవలం మన భారత దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా చికెన్ కు మంచి డిమాండ్ ఉంటుంది. రోజూ ఎంతో మంది చికెన్ ను తిటూంటారు. అయితే రోజూ వ్యాయామాలు చేసే వారికి చికెన్ తినాలని డైటీషియన్స్ సూచిస్తారు. డైటీషియన్స్ సూచనల ప్రకారం ఎంత తక్కువ క్వాంటీటీలో చికెన్ తీసుకున్నా.. అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. చికెన్ రోజూ..
చికెన్ అంటే చాలా మందికి ప్రాణం. ముక్క లేనిదే ముద్ద తిగదు. ఏ సెలబ్రేషన్స్ లో అయినా ఉండే కామన్ ఐటెమ్ చికెన్. ధర తక్కువతో పాటు మంచి టేస్టీగా కూడా ఉంటుంది. అందులోనూ చికెన్ లో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇది బాడీకి ఎలాంటి హానీ చేయదు. కేవలం మన భారత దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా చికెన్ కు మంచి డిమాండ్ ఉంటుంది. రోజూ ఎంతో మంది చికెన్ ను తిటూంటారు. అయితే రోజూ వ్యాయామాలు చేసే వారికి చికెన్ తినాలని డైటీషియన్స్ సూచిస్తారు. డైటీషియన్స్ సూచనల ప్రకారం ఎంత తక్కువ క్వాంటీటీలో చికెన్ తీసుకున్నా.. అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. చికెన్ రోజూ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. అన్నే నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ తింటే ఆరోగ్యమేనా?
ఈ ప్రశ్నకు సమాధానం మనం వండే దానిపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. చికెన్ ను ఆరోగ్యకరమైన పద్దతిలో వండితే ఆరోగ్యమేనట. వేడి నీటిలో పూర్తిగా ఉడికించిన చికెన్ మంచిదే అని అంటున్నారు. అలా కాకుండా మసాలాలు బాగా దట్టించి, వేపుళ్లు, గ్రిల్స్ వంటివి చేస్తే నష్టాలే ఎక్కువ అని చెబుతున్నారు.
చికెన్ ను రోజూ తినవచ్చా?
నిపుణుల అధ్యయనం ప్రకారం బాగా ఉడికించినా లేదా గ్రిల్, వేపుళ్లు వంటివి చేసినా చికెన్ వారానికి రెండు సార్లకు మించి ఎక్కవ మోతాదులో తీసుకోకూడదని అంటున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని సూచిస్తున్నారు. చికెన్ లో ఉండేది ముఖ్యంగా ప్రోటీనే కాబట్టి.. దీన్ని సమపాలల్లో తీసుకుంటే బెటర్ అని చెబుతున్నారు.
మనం ఆహారంలో కేవలం చికెన్ మాత్రమే కాకుండా ఇతర ఆహార పదార్థాలు కూడా తీసుకుంటూ ఉంటాం. కాబట్టి వాటిలో ఉండే ప్రోటీన్ కూడా శరీరానికి లభిస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నా కూడా జీర్ణ సంబంధిత సమస్యలు, బరువు పెరగడం, గుండె సమస్యలు వంటివి తలెత్తవచ్చు. ఎందుకుంటే జీర్ణ వ్యవస్థ ప్రోటీన్ ను ఎక్కువగా జీర్ణం చేయలేదు. దీంతో లేని పోని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అలాగే కేవలం బాడీకి ప్రోటీన్ మాత్రమే సరిపోదని, విటమిన్లు, మినరల్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు కూడా అవసరమని సూచించారు. చికెన్ కంటే చేపలు తింటే ఇంకా బెటర్ వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే గుడ్డులో కూడా ప్రోటీన్ లభిస్తుందన్నారు. కేవలం చికెన్ పై మాత్రమే ఆధార పడకూడదని.. ఇతర ఆహార పదార్థాలను కూడా తీసుకోవచ్చని నిపుణులు వెల్లడించారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.