Immunity Drink: రోజూ ఒక్క గ్లాస్ ఈ సూపర్ డ్రింక్ తాగండి.. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు!!

ఈ ఒక్క హెల్దీ డ్రింక్ తాగితే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ డ్రింక్ ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా.. అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆడవారికి ఇది అద్బుతంగా పని చేస్తుంది. ఇంట్లో పనితో, పిల్లలతో ఎంతో అలసిపోతారు. అలాంటి వారు ఈ డ్రింక్ తాగితే రోజూ ఉండే సిక్ నెస్ ను దూరం చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు ఈ డ్రింక్ ఇస్తే శరీరం బలంగా, దృఢంగా తయారవుతుంది. ఈ పానియం రోజూ తాగడం వల్ల కంటి సమస్యలు, మతి మరపు, అల్లీమర్స్ కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. కండరాలు, నరాలు బలంగా..

Immunity Drink: రోజూ ఒక్క గ్లాస్ ఈ సూపర్ డ్రింక్ తాగండి.. డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు!!
Immunity Drinks
Follow us
Chinni Enni

|

Updated on: Sep 16, 2023 | 4:24 PM

ఈ ఒక్క హెల్దీ డ్రింక్ తాగితే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ డ్రింక్ ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా.. అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆడవారికి ఇది అద్బుతంగా పని చేస్తుంది. ఇంట్లో పనితో, పిల్లలతో ఎంతో అలసిపోతారు. అలాంటి వారు ఈ డ్రింక్ తాగితే రోజూ ఉండే సిక్ నెస్ ను దూరం చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు ఈ డ్రింక్ ఇస్తే శరీరం బలంగా, దృఢంగా తయారవుతుంది. ఈ పానియం రోజూ తాగడం వల్ల కంటి సమస్యలు, మతి మరపు, అల్లీమర్స్ కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. కండరాలు, నరాలు బలంగా తయారవుతాయి. అలసట, బలహీనత, నీరసం వంటి సమస్యలు తగ్గుతాయి. ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఈ డ్రింక్ ని తీసుకుంటే రోజంతా యాక్టీవ్ గా ఉండొచ్చు. ఈ డ్రింక్ తో ఒక్కటేంటి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో, దీని వల్ల ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హెల్దీ డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు:

అర లీటర్ పాలు, 10 ఖర్జూరాలు, 10 బాదం పప్పులు, 8 జీడి పప్పులు, పటిక బెల్లం.

ఇవి కూడా చదవండి

తయారు చేయు విధానం:

ఖర్జూర పండ్లలో ఉండే గింజలను తీసేసి.. రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం బాదం పప్పు, జీడి పప్పులను కచ్చా పచ్చా పౌడర్ గా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో అర లీటర్ పాలను వేసుకోవాలి. ఇవి ఒక పొంగు వచ్చాక కొద్దిగా పసుపు వేసుకుని మరిగించాలి. ఆ తర్వాత ఖర్జూరపు పేస్ట్, బాదం, జీడి పప్పు పొడి వేసి కలుపుకోవాలి. చిన్న మంట మీద ఈ పాలను మరిగిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో ఒక్కొక్క సారి కలుపుతూ ఉండాలి. సరిగ్గా 10 నిమిషాలు మరిగాక.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన హెల్దీ డ్రింక్ సిద్ధం. వీటిని అలా గోరు వెచ్చగా ఉన్నప్పుడైనా లేదా ఫ్రిజ్ లో పెట్టుకుని కాస్త చల్లగా అయిన తర్వాతైనా తాగినా పర్వాలేదు.

హెల్దీ డ్రింక్ ప్రయోజనాలు:

పుష్టిగా ఉంటారు:

బలహీనంగా ఉండేవారు, నిరంతరం అనారోగ్య సమస్యల బారిన పడేవారు ఈ డ్రింక్ తాగితే బలంగా, పుష్టిగా ఉంటారు.

కంటిచూపు మెరుగు పడుతుంది:

ఈ డ్రింక్ ని క్రమం తప్పకుండా తాగితే.. కంటి చూపు మెరుగు పడుతుంది. వయసుపై బడడం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మెదడు

మెదడు ఆరోగ్యంగా ఉంటుంది:

రోజూ ఈ డ్రింక్ తాగడం వల్ల మెదడు ఆరోగ్యంగా పని చేస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు దరి చేరవు.

పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

పిల్లలకు కూడా ఈ డ్రింక్ తాగించడం వల్ల వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వారు యాక్టీవ్ గా ఉంటారు. బలంగా, పుష్టిగా ఉంటారు.

చర్మ, జుట్టు సమస్యలు దూరం:

వీటిలో ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి చర్మ, జుట్టు సమస్యలు తగ్గుతాయి.

ఇంకా ఇలా ఒక్కటేంటీ.. చాలా ప్రయోజనాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా ఈ డ్రింక్ ని తాగితే.. డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో