Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heart Healthy: గుండె ఆరోగ్యంగా ఉండాలా.. అయితే కొలెస్ట్రాల్ లెవల్స్ ను ఇలా అదుపులో ఉంచండి!

ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది గుండె పోటుతో మరణిస్తున్నారు. రెండేళ్ల వయసు ఉన్న చిన్నారులు సైతం హార్ట్ ఎటాక్ తో మరణించడం బాధకరమైన విషయం. గుండె పోటుకు ముఖ్య కారణం హై కొలెస్ట్రాల్. ఇది ఎక్కువగా ఉంటే గుండె సమస్యలకు దారి తీస్తుంది. దీనికి ముఖ్య కారణం. ఇప్పుడున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు. కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల.. రక్తం సరఫరాకు అడ్డంకిగా మారుతుంది. దీంతో గుండెకు సక్రమంగా రక్తం, ఆక్సిజన్ అందక గుండె పోటు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. వీటిని సరి చేసుకుని మంచి డైట్ ని ఫాలో అయితే కొలెస్ట్రాల్ ను నియంత్రణలోకి..

Heart Healthy: గుండె ఆరోగ్యంగా ఉండాలా.. అయితే కొలెస్ట్రాల్ లెవల్స్ ను ఇలా అదుపులో ఉంచండి!
Heart Health
Follow us
Chinni Enni

|

Updated on: Sep 15, 2023 | 3:24 PM

ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది గుండె పోటుతో మరణిస్తున్నారు. రెండేళ్ల వయసు ఉన్న చిన్నారులు సైతం హార్ట్ ఎటాక్ తో మరణించడం బాధకరమైన విషయం. గుండె పోటుకు ముఖ్య కారణం హై కొలెస్ట్రాల్. ఇది ఎక్కువగా ఉంటే గుండె సమస్యలకు దారి తీస్తుంది. దీనికి ముఖ్య కారణం. ఇప్పుడున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు. కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తినడం వల్ల.. రక్తం సరఫరాకు అడ్డంకిగా మారుతుంది. దీంతో గుండెకు సక్రమంగా రక్తం, ఆక్సిజన్ అందక గుండె పోటు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. వీటిని సరి చేసుకుని మంచి డైట్ ని ఫాలో అయితే కొలెస్ట్రాల్ ను నియంత్రణలోకి తీసుకు రావడం పెద్ద విషయం కాదని చెబుతున్నారు నిపుణులు. కొలెస్ట్రాల్ లెవల్స్ ను అదుపులోకి తీసుకు రావడానికి ఈజీగా మనం పాటించాల్సిన కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి:

కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు చాలా దూరంగా ఉండాలి. అంటే పాలు, మటన్, జంక్ ఫుడ్, ఆయిల్, షుగర్ ఫుడ్స్ వంటి వాటిని పక్కకు పెట్టాలి. ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు వంటి వాటిని తీసుకుంటే కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచవచ్చు.

ఇవి కూడా చదవండి

ట్రాన్స్ ఫ్యాట్:

మీరు తీసుకునే ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్లకు దూరంగా ఉండాలి. అంటే కుక్కీస్, కేక్స్, బేకరీ ఫుడ్ ఐటెమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎక్కువగా స్వీట్లు తీసుకోకూడదు. వీటిలో కొలెస్ట్రాల్ ను పెంచే చెడు కొవ్వులు ఎక్కువ శాతం ఉంటాయి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి:

మీ డైట్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. దీని వల్ల రక్తంలోని ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను ప్రభావితం చేస్తుంది. అలాగే రక్త పోటును తగ్గించడమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో ఇంకా ఎన్నో ఆరోగ్య కరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఫిట్స్, వాల్ నట్స్ లో ఇవి ఎక్కువగా ఉంటాయి.

కరిగే ఫైబర్:

అలాగే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్థాలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఈ ఫైబర్ ఎక్కువగా ఓట్ మీల్, యాపిల్స్, బీన్స్, మొలకలు వంటి ఆహారాల్లో బాగా లభిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.