Ear Pain: చెవి పోటు సమస్య వేధిస్తోందా? ఇలా హోమ్ రెమిడీస్ తో చెక్ పెట్టండి!
పిల్లలకైనా, పెద్దలకైనా అప్పుడప్పుడు చెవి పోటు రావడం సర్వ సాధారణమైన విషయం. దీని నొప్పి వర్ణనాతీతం. ఇక పిల్లలైతే గిల గిలమని కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు. కొంత మందికి సైనస్ ఉంటుంది. దీని వల్ల కూడా చెవి పోటు వస్తుంది. అలాగే చల్ల గాలి వెళ్లినా, చీమలు వెళ్లినా, చీము ఉన్నా కూడా ఇలా నొప్పులు వస్తాయి. కామన్ గా అర్థరాత్రులు ఈ చెవి నొప్పి ఎక్కువగా వస్తుంది. దీంతో ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఇంటి చిట్కాలు ఉపయోగించి.. ఆ నొప్పును అదుపులోకి తీసుకు రావచ్చు. చెవి నొప్పిని ఇంటి చిట్కాలతో తగ్గించేందుకు ఆయుర్వేదంలో కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిని..
పిల్లలకైనా, పెద్దలకైనా అప్పుడప్పుడు చెవి పోటు రావడం సర్వ సాధారణమైన విషయం. దీని నొప్పి వర్ణనాతీతం. ఇక పిల్లలైతే గిల గిలమని కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు. కొంత మందికి సైనస్ ఉంటుంది. దీని వల్ల కూడా చెవి పోటు వస్తుంది. అలాగే చల్ల గాలి వెళ్లినా, చీమలు వెళ్లినా, చీము ఉన్నా కూడా ఇలా నొప్పులు వస్తాయి. కామన్ గా అర్థరాత్రులు ఈ చెవి నొప్పి ఎక్కువగా వస్తుంది. దీంతో ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఇంటి చిట్కాలు ఉపయోగించి.. ఆ నొప్పును అదుపులోకి తీసుకు రావచ్చు. చెవి నొప్పిని ఇంటి చిట్కాలతో తగ్గించేందుకు ఆయుర్వేదంలో కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అయితే చెవి పోటును తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి ఆకులు:
తులసి ఆకులు అందరి ఇళ్లలోనూ ఉంటాయి. ఈ ఆకుల రసాన్ని చెవిలో రెండు, మూడు చుక్కలు వేయడం వల్ల చెవి నొప్పి తగ్గే అవకాశం ఉంది. వీటిలో రోగ నిరోధక శక్తి తగ్గించే గుణాలతో పాటు యాంటీ ఇన్ ఫ్లామేషన్ గుణాలు కూడా ఉంటాయి. కాబట్టి చెవి పోటును అదుపులోకి తీసుకురావచ్చు.
లవంగాలు:
లవంగాలు కూడా చెవి నొప్పిని అదుపు చేసే గుణం ఉంది. లవంగాల నూనె రెండు చుక్కలు చెవి పోటు వస్తున్న చెవిలో చేస్తే.. ఉపశమనం లభిస్తుంది. లవంగాల నూనె అందుబాటులో లేకపోతే.. నువ్వుల నూనెలో రెండు లవంగాలు వేడి మరిగించాలి. దీన్ని చల్లార్చి, వడ కట్టి రెండు చుక్కలు చెవిలో వేయాలి. ఆలివ్ ఆయిల్ లో కూడా చెవి నొప్పి తగ్గించే గుణం ఉంది. ఇది అయినా వాడవచ్చు.
వెల్లుల్లి:
చెవి పోటు వచ్చిన వారిలో కొంత మందికి బయట వాపు కనిపిస్తుంది. అలాంటప్పుడు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి దాన్ని చిన్న వస్త్రంలో కట్టి.. వాపు ఉన్న చోట ఒత్తుతూ ఉండాలి. ఇలా చేస్తే వాపు అదుపులోకి వస్తుంది.
అల్లం:
అల్లం కూడా వాపును తగ్గించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అల్లం రసాన్ని కొద్దిగా తీసుకోవాలి. కాటన్ ని అల్లం రసంలో ముంచి.. వాపు ఉన్న చోట మర్దనా చేస్తే ఉపశమనం లభిస్తుంది.
నీలగిరి చెట్టు ఆకులు:
నీలగిరి చెట్టు ఆకులు కూడా చెవి పోటును తగ్గించడానికి బాగా సహకరిస్తుంది. వీటిని ఎక్కువగా జెండూ బామ్ లో ఉపయోగిస్తారు. ఈ నీలగిరి చెట్టు ఆకుల్ని, నూనెను చెవి పోటు తగ్గించడానికే కాకుండా, తల నొప్పి, జలుబు, గొంతు నొప్పి, నడుపు నొప్పి, ఒళ్లు నొప్పులు వంటికి కూడా ఉపయోగించవచ్చు. ఒళ్లు నొప్పులుగా ఉన్నప్పుడు నీలగిరి చెట్టు నూనెని ఓ ఐదారు చుక్కలను గోరు వెచ్చటి నీటిలో వేసి స్నానం చేస్తే సరిపోతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి