Besan Dhokla: శనగపిండితో ఇలా బ్రేక్ ఫాస్ట్ చేయండి.. అస్సలు వదిలిపెట్టరు!!

వంట గదిలో మనం నిత్యం ఉపయోగించే వాటిల్లో శనగ పిండి కూడా ఒకటి. శనగ పిండితో చాలా రకాలైన స్వీట్లు, స్నాక్స్, బ్రేక్ ఫాస్ట్, చట్నీలు ఎన్నో చేసుకోవచ్చు. శనగ పిండికి అంత రుచి ఉంటుంది. శనగ పిండితో ఎలాంటి వంటకాలైనా ఈజీగా, తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. శనగ పిండితో చేసే వంటల్లో ఒకటి డోక్లా. దీన్ని ఎక్కువగా మార్వాడీలు చేసుకుంటారు. ఈ డోక్లాని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా, స్నాక్స్ గా తీసుకుంటారు. వాళ్లు ఈ వంటకం చాలా ప్రత్యేకం. ఎన్నో విధాలుగా ఈ డోక్లాను ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఈ బేసిన్ డోక్లాను ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు..

Besan Dhokla: శనగపిండితో ఇలా బ్రేక్ ఫాస్ట్ చేయండి.. అస్సలు వదిలిపెట్టరు!!
Besan Dhokla
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 18, 2023 | 10:00 PM

వంట గదిలో మనం నిత్యం ఉపయోగించే వాటిల్లో శనగ పిండి కూడా ఒకటి. శనగ పిండితో చాలా రకాలైన స్వీట్లు, స్నాక్స్, బ్రేక్ ఫాస్ట్, చట్నీలు ఎన్నో చేసుకోవచ్చు. శనగ పిండికి అంత రుచి ఉంటుంది. శనగ పిండితో ఎలాంటి వంటకాలైనా ఈజీగా, తక్కువ సమయంలోనే చేసుకోవచ్చు. శనగ పిండితో చేసే వంటల్లో ఒకటి డోక్లా. దీన్ని ఎక్కువగా మార్వాడీలు చేసుకుంటారు. ఈ డోక్లాని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా, స్నాక్స్ గా తీసుకుంటారు. వాళ్లు ఈ వంటకం చాలా ప్రత్యేకం. ఎన్నో విధాలుగా ఈ డోక్లాను ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఈ బేసిన్ డోక్లాను ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బేసన్ డోక్లాకు కావాల్సిన పదార్థాలు:

శనగ పిండి, ఉప్పు, పసుపు, నూనె, బేకింగ్ పౌడర్.

ఇవి కూడా చదవండి

బేసన్ డోక్లా తాళింపు పదార్థాలు:

సన్నగా తరిగిన పచ్చి మిర్చి, కరివేపాకు, నూనె, ఉప్పు, ఆవాలు, నీళ్లు, పంచదార, నిమ్మరసం.

తయారీ విధానం:

ముందుగా దీన్ని ఒక గిన్నెలో శనగ పిండి, ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీన్ని ఓ 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత శనగ పిండి మిశ్రమంలో కొద్దిగా నూనె, కొద్దిగా బేకింగ్ పౌడర్ లేదా ఈనో వేసి మరోసారి బాగా కలుపుకుని.. వెడల్పుగా ఉన్న ట్రేలో కానీ పళ్లెంలో కానీ ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. మరో మందపాటి లోతు గిన్నెలో సగం వరకూ నీళ్లు పోసుకుని.. అందులో స్టాండ్ ఉంచుకుని.. దానిపై బేసన్ కలుపుకున్న గిన్నె ఉంచి.. మీడియం మంటపై శనగ పిండి ఉడికేంత వరకూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ ప్లేట్ ను బయటకు తీసుకుని డోక్లాను నచ్చిన షేప్ లో కట్ చేసుకోవాలి.

ఇప్పుడు తాళింపుకు సిద్ధం చేసుకుందాం. స్టవ్ పై మరో పాన్ పెట్టుకుని ఇందులో కొంచెం నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత కొన్ని నీళ్లు పోసి, ఉప్పువేసి కలపాలి. నీళ్లు మరిగిన తర్వాత ఒక స్పూన్ పంచదార వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్ట్స్ ఇందులో నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు డోక్లాపై వేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే డోక్లా రెడీ.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!