Thyroid: ఇంట్లోనే ఉంటూ ఈజీగా ఇలా థైరాయిడ్ లెవల్స్ ను తగ్గించుకోండి!!

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చాలా మంది ఫేస్ చేసే దీర్ఘకాలిక వ్యాధుల్లో థైరాయిడ్ కూడా ఒకటి. థైరాయిడ్ వచ్చిందంటే.. ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే. అలాగే సమయానికి అన్నీ అవ్వాల్సిందే. ఏది తేడా వచ్చినా అది శరీరంపై ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ థైరాయిడ్.. మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పురుషుల్లో కూడా దీని ప్రభావం చూపిస్తుంది. థైరాయిడ్ అనేది గొంతు దగ్గర ఉంటుంది. ఇది జీవ క్రియలను మెరుగు పరుస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథి హర్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల థైరాయిడ్ సమస్యలు ఎదరవుతాయి. థైరాయిడ్ వచ్చిందంటే చాలా వేగంగా బరువు పెరుగుతారు..

Thyroid: ఇంట్లోనే ఉంటూ ఈజీగా ఇలా థైరాయిడ్ లెవల్స్ ను తగ్గించుకోండి!!
Thyroid
Follow us
Chinni Enni

|

Updated on: Sep 15, 2023 | 2:10 PM

ప్రస్తుతం ఇప్పుడున్న కాలంలో చాలా మంది ఫేస్ చేసే దీర్ఘకాలిక వ్యాధుల్లో థైరాయిడ్ కూడా ఒకటి. థైరాయిడ్ వచ్చిందంటే.. ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే. అలాగే సమయానికి అన్నీ అవ్వాల్సిందే. ఏది తేడా వచ్చినా అది శరీరంపై ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ థైరాయిడ్.. మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. పురుషుల్లో కూడా దీని ప్రభావం చూపిస్తుంది. థైరాయిడ్ అనేది గొంతు దగ్గర ఉంటుంది. ఇది జీవ క్రియలను మెరుగు పరుస్తుంది. ఈ థైరాయిడ్ గ్రంథి హర్మోన్లను ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల థైరాయిడ్ సమస్యలు ఎదరవుతాయి. థైరాయిడ్ వచ్చిందంటే చాలా వేగంగా బరువు పెరుగుతారు.. లేదా బక్క పల్చగా తయారవుతారు. దీన్ని మొదట్లోనే నియంత్రించుకోవాలి. లేదంటే ఇది క్యాన్సర్ గా మారే ప్రమాదం కూడా ఉంది. దీంతో ప్రాణాపాయానికే ప్రమాదం. కాబట్టి అప్పుడప్పుడు థైరాయిడ్ టెస్టులు కూడా చేయించుకోవడం ఉత్తమమే. అయితే కొన్ని పద్దతులను ఇంట్లోనే పాటిస్తూ థైరాయిడ్ లెవల్స్ ను తగ్గించుకుంటూ ఉండవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వ్యాయామం:

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కూడా థైరాయిడ్ లక్షణాలను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. వ్యాయామం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. జీవక్రియను మెరుగు పరిచి, మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. శరీరాన్ని, కండరాలను శక్తిగా తయారు చేస్తుంది. బాడీలో ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది వ్యాయామం. కాబట్టి డైలీ వ్యాయామం చేయడం చాలా బెటర్.

ఇవి కూడా చదవండి

ఒత్తిడి, ఆందోళనను దూరం చేయాలి:

మనిషి అన్నాక ఒత్తిడి, ఆందోళన కలగడం సహజం. ఇంట్లోని, పని చేసే కార్యాలయాల్లో పని కారణంగా ఒత్తిడి కలుగుతుంది. దీన్ని తగ్గించుకోవాలంటే వీలైనంత వరకూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే రోజూ తగిన సమయంలో యోగా, మెడిటేషన్ వంటివి చేస్తూ ఉంటే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆందోళనను తగ్గించుకోవడం వల్ల కూడా థైరాయిడ్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు.

సరైన సమయంలో నిద్ర పోవాలి:

సెల్ ఫోన్ల కారణంగా చాలా మంది సరైన సమయంలో నిద్ర పోవడం లేదు. రాత్రిళ్లు ఫోన్లు చూసుకుంటూ నిద్రని ఆటంక పరుస్తున్నారు. ఇలా సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆందోళన, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సరైన సమయంలో నిద్ర పోయి, లేవడం అలవాటు చేసుకోవాలి. దీంతో అన్నీ సెట్ అవుతాయి.

న్యూట్రీషియన్స్, మినరల్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి:

మనం తీసుకునే రోజు వారీ ఆహారంలో ప్రోటీన్లు, మినరల్స్, శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉన్న ఫుడ్ తీసుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉన్న వారు జంక్ ఫుడ్ కి చాలా దూరంగా ఉండాలి.

యాక్టీవ్ గా ఉండాలి:

థైరాయిడ్ తో బాధ పడుతున్న వారు వీలైనంతగా యాక్టీవ్ గా ఉండాలి. రోజూ ఉత్సాహంగా పనులు చేస్తూ ఉండాలి. అప్పుడే థైరాయిడ్ ను కంట్రోల్ లోకి తీసుకు రావచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!