AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ginger for Skin: అల్లంతో అందాన్ని పెంచుకోండిలా! ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నింటికి చెక్ పెట్టవచ్చు!

మనం నిత్యం ఇళ్లలో ఉపయోగించే వస్తువుల్లో అల్లం కూడా ఒకటి. అల్లాన్ని వంటల్లో విరివిగా ఉపయోగిస్తూంటాం. అల్లంతో ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఆయుర్వేదంలో కూడా అల్లాన్ని ఔషధంగా ఉపయోగిస్తారు. ఎంతో పురాతాన కాలం నుంచి అల్లం ప్రాచుర్యంలో ఉంది. అలాగే ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుచుకునే శక్తి అల్లంలో ఉంది. అల్లాన్ని ఎలా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అల్లంతో చర్మ సమస్యలను కూడా దూరం..

Ginger for Skin: అల్లంతో అందాన్ని పెంచుకోండిలా! ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నింటికి చెక్ పెట్టవచ్చు!
Ginger
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 23, 2023 | 6:00 PM

Share

మనం నిత్యం ఇళ్లలో ఉపయోగించే వస్తువుల్లో అల్లం కూడా ఒకటి. అల్లాన్ని వంటల్లో విరివిగా ఉపయోగిస్తూంటాం. అల్లంతో ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఆయుర్వేదంలో కూడా అల్లాన్ని ఔషధంగా ఉపయోగిస్తారు. ఎంతో పురాతాన కాలం నుంచి అల్లం ప్రాచుర్యంలో ఉంది. అలాగే ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుచుకునే శక్తి అల్లంలో ఉంది. అల్లాన్ని ఎలా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అల్లంతో చర్మ సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. అల్లంలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక స్కిన్ ప్రాబ్లెమ్స్ కి చెక్ పెడతాయి. ఎటువంటి చర్మ తత్వం ఉన్న వారైనా అల్లాన్ని యూజ్ చేయవచ్చు. చర్మం రంగును మెరుగు పరచడమే కాకుడా సమస్యలను తగ్గించడంలో కూడా అల్లం బాగా యూజ్ అవుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ ప్లామేషన్ ను తగ్గిస్తుంది

చాలా మంది చర్మంపై ఇన్ ప్లామేషన్ వచ్చి బాధ పడుతూంటారు. ఇలాంటి వారు చిన్న అల్లం ముక్కను తీసుకుని.. దాన్ని చర్మం ఉబ్బిన చోట రుద్దుతూ మర్దనా చేయాలి. అరగంట సేపు తర్వాత దీన్ని నీటితో శుభ్రం చేసుకోసుకుంటే ఉపశమనం ఉంటుంది. ఇలా రోజుకు మూడు సార్లు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

కళ్ల చుట్టు ఎరుపును తగ్గించుకోవచ్చు:

కొంత మందికి కళ్ల చుట్టూ ఉబ్బినట్టు, ఎర్రగా అవుతుంది. ఇలాంటి వారు అల్లం టీ బ్యాగులను ఉబ్బిన చోట ఉంచి మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫలితం కనిపిస్తుంది. ఆ తర్వాత అల్లం టీ బ్యాగులను పడేయకుండా ఓ ఐదు నిమిషాలైన కళ్ల పై ఉంచుకోవచ్చు. ఇలా చేస్తే రిలీఫ్ గా ఉంటుంది.

మొటిమలకు చెక్ పెడుతుంది:

కొంత మందికి ముఖంపై మొటిమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి వారు అల్లాన్ని ఉపయోగిస్తే తగిన ఫలితం ఉంటుంది.

ఇలా చేయండి.. అర టీ స్పూన్ అల్లం రసంలో, అర టీ స్పూన్ తేనెను బాగా కలిపి ముఖంపై రాయాలి. ఓ అరగంట పాటు ఇలా ఉంచిన తర్వాత.. నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.

ముఖంపై గాయాల మచ్చలు:

మహిళలకు ఇంట్లో వంటలు చేసేటప్పుడు ఏమైనా తుళ్లి ఒంటిపై, ముఖంపై గాయాలు అవుతాయి. మగవారికి ఏమైనా పనులు చేసేటప్పుడు సాధారణంగా గాయాలు అవుతాయి. ఆ తాలూకూ మచ్చలు అంత తొందరగా పోవు. అలంటి వాటికి అల్లంతో పరిష్కరించుకోవచ్చు. అల్లం రసంలో నిమ్మ రసం కలిపి రాస్తే గాయాల వలన తగిలిన మచ్చలు పోతాయి.

రంగు మెరుగు పడాలంటే:

చాలా మందికి చర్మం రంగు మెరుగు పడాలనుకుంటూంటారు. అలాంటి వారు అర టీ స్పూన్ అల్లం రసంలో, రెండు స్పూన్ల పెరుగు కలిపి స్కిన్ పై రాస్తే.. చర్మం ఛాయ మారుతుంటుంది. అంతే కాకుండా అందంగా, నల్ల మచ్చలు ఏమైనా ఉంటే పోతాయి.

కాగా చాలా మందికి అల్లం రసం పడదు. దద్దర్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని ఉపయోగించే ముందు.. అల్లం రసాన్ని చేతిపై కానీ, కాళ్లపై కానీ ముందు ఐదు నిమిషాలు రాసుకుని చూడాలి. ఎలాంటి సమస్యలు లేకపోతే అప్పుడు నేరుగా ముఖంపై రాసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.