Saithalyasana: ఇమ్యూనిటీని పెంచే సైతల్యాసనం.. ఆ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు!
సాధారణంగా వర్షా కాలం వచ్చిందంటే అనారోగ్యాలు చుట్టుముడతాయి. జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. ఇంట్లో ఒకరికి వచ్చాయంటే.. చాలు ఇంట్లో వారందరినీ ఒక రౌండ్ వేసేస్తాయి. ఎందుకంటే ఇవి అంటు వ్యాధుల జాబితాలోకి వస్తాయి. దీంతో చాలా జాగ్రత్తలు పాటించాలి. అందులోనూ ప్రస్తుతం ఉన్న ఆహార శైలి కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగిన విధంగా ఉండటం లేదు. దీంతో త్వరగా జబ్బుల..
సాధారణంగా వర్షా కాలం వచ్చిందంటే అనారోగ్యాలు చుట్టుముడతాయి. జ్వరం, దగ్గు, జలుబు, తలనొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. ఇంట్లో ఒకరికి వచ్చాయంటే.. చాలు ఇంట్లో వారందరినీ ఒక రౌండ్ వేసేస్తాయి. ఎందుకంటే ఇవి అంటు వ్యాధుల జాబితాలోకి వస్తాయి. దీంతో చాలా జాగ్రత్తలు పాటించాలి. అందులోనూ ప్రస్తుతం ఉన్న ఆహార శైలి కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగిన విధంగా ఉండటం లేదు. దీంతో త్వరగా జబ్బుల బారిన పడుతున్నారు.
ముఖ్యంగా ఇమ్యూనిటీ ఉంటేనే జబ్బులతో ఫైట్ చేసి.. మనల్ని రక్షిస్తాయి. ముఖ్యంగా దోమలు కుట్టకుండా చూసుకోవాలి. ఈ సమయంలోనే డెగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి భయంకర రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో ముఖ్యంగా బాడీలో ఇమ్యూనిటీని పెంచుకోవాలి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే యోగా ఆసనం ఒకటి ఉంది. దీన్ని రెగ్యులర్ గా వేస్తే బాడీలో ఇట్టే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మరి ఆ ఆసనం ఏంటి? ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సైతల్యాసనం.. ఈ ఆసనం వేస్తే శరీంలో ఇమ్యూనిటీ ఇట్టే పెరుగుతుంది. అయితే క్రమం తప్పకుండా వేస్తూ ఉండాలి. అలాగే వర్షా కాలంలో మంచి ఫుడ్ ని తీసుకోవాలి. ఈ ఆసనం వేయడం వల్ల కేవలం ఇమ్యూనిటీనే కాదు.. ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. అలాగే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బీపీ అదుపులోకి వస్తుంది. బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగ్గా ఉంటుంది. వెన్ను దృఢంగా, తొడ కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. పొట్ట కండరాలు కూడా గట్టి పడతాయి. నాడీ మండల వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది.
సైతల్యాసనం ఎలా వేయాలంటే:
లెఫ్ట్ లెగ్ ను వెనక్కి మడిచి.. రైట్ లెగ్ ని ఎడమ తొడపై ఉంచి కూర్చోవాలి. ఆ తర్వాత ఊపిరి తీసుకుంటూ రెండు చేతుల్నీ పైకి తీసుకు రావాలి. ఇప్పుడు చేతుల్ని చాపి నేల మీద ఉంచి.. శ్వాస వదులుతూ కుడి మోకాలి వైపు ముందుకు వంగాలి. ముఖం గడ్డాన్ని కుడి మోకాలికి ఆనించే ప్రయత్నం చేయాలి. ఇలా ఓ ఐదు సెకన్ల పాటు ఉంటే సరిపోతుంది. ఇలా కుడి వైపు, ఎడమ వైపు ఆరు సార్లు చేయాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి