పప్పు అయినా..? చట్నీ చేసినా.. తాలింపులో కరివేపాకు ఉండాల్సిందే.. కరివేపాకులు వంట రుచిని మరింత పెంచుతాయి. అయితే, కరివేపాకులను ఆయుర్వేద ఔషధంగా పరిగణిస్తారు. కరివేపాకుల్లో విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉంటాయి. భారతదేశంలోని చాలా వంటలలో ఈ ఆకులను ఉపయోగిస్తారన్న విషయం మీకు తెలిసిందే. ఇవి రుచి పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తాయి. చాలా మంది ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 4 నుంచి 5 కరివేపాకులను నమలాలని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏయే వ్యాధులు నయమవుతాయో ఇప్పుడు తెలుసుకోండి..