గత వారం చివరికి బంగారం ధరలు పై చూపులతో ఉన్నాయి. అదే ట్రెండ్ తో ఈ వారం కూడా ప్రారంభమైంది. వారం అంతా పైకీ కిందికీ కదిలిన బంగారం ధరలు చివరికి వచ్చేసరికి స్వల్పంగా తగ్గుదలను నమోదు చేశాయి. ఈ వారం ప్రారంభంలో బులియన్ మార్కెట్లో సెప్టెంబర్ 18న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 60,080 రూపాయల వద్ద ఉంది. ఇక్కడ నుంచి అటూ ఇటూగా మారుతూ ఈ వారం అంతా కదలాడింది. 19 వ తేదీన రూ.140లు పెరిగింది. తరువాత ఒక్కరోజు స్థిరంగా ఉన్న బంగారం ధరలు 21, 22 తేదీల్లో రెండు రోజులూ కలిపి రూ.390లు తగ్గిపోయింది. చివరికి సెప్టెంబర్ 23 న 110 రూపాయల స్వల్ప పెరుగుదలతో 59,950 రూపాయల వద్ద వారాన్ని ముగించింది.