- Telugu News Photo Gallery Artificial intelligence means AI is not only stealing your jobs, but also your money
FraudGPT: FraudGPT కి చిక్కుకుంటే మీ డబ్బులు గోల్ మాల్ అయిపోతాయి.. ఎలా అంటే..
మీతో కొన్ని సంవత్సరాల క్రితం పనిచేసిన వ్యక్తి నుంచి మీకు కాల్ వచ్చిందా? అతని తల్లికి వైద్య ఖర్చుల కోసం డబ్బు అవసరం అని అడిగితె మీరు డబ్బు పంపించారా? తరువాత ఆ వ్యక్తి మీకు కలిసి డబ్బు ఇవ్వడం ఏమిటి? నేను ఫోన్ చేయడం ఏమిటి ? అని అడిగాడా? అంటే మీరు AI అవతార్ మోసానికి చిక్కుకున్నట్టే. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో జరుగుతున్న సరికొత్త సైబర్ మోసం ఇది. మనకు తెలిసిన వ్యక్తి లానే వినిపించే స్వరంతో.. మాట్లాడి.. మనల్ని ఏమార్చే కొత్త ఆన్లైన్ మోసం ఇది.
Updated on: Sep 23, 2023 | 1:57 PM

అంటే మీరు AI అవతార్ మోసానికి చిక్కుకున్నట్టే. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో జరుగుతున్న సరికొత్త సైబర్ మోసం ఇది. మనకు తెలిసిన వ్యక్తి లానే వినిపించే స్వరంతో.. మాట్లాడి.. మనల్ని ఏమార్చే కొత్త ఆన్లైన్ మోసం ఇది

ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటే AI మీ ఉద్యోగాలను మాత్రమే కాకుండా, మీ డబ్బును కూడా లాగేస్తోంది. McAfee Corp చేసిన సర్వే ప్రకారం, 47 శాతం మంది లేదా 18 ఏళ్లు పైబడిన భారతీయుల్లో దాదాపు సగం మందికి అలాంటి AI వాయిస్ కాల్‌లు వచ్చాయి.

AI-ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ఇలా మోసం చేస్తారు. ఈ AI చాట్‌బాట్‌కి FraudGPT లేదా WormGPT అని పేరు పెట్టారు. డార్క్ వెబ్‌లో లాంగ్వేజ్ జనరేటివ్ మోడల్ ప్రోగ్రామ్‌లు మోసగాళ్లు సృష్టించారు. ఇవి మీ సంభాషణలు, మీ మెయిల్ కమ్యూనికేషన్‌లు, మీరు వ్రాసే విధానాన్ని కాపీ చేయగలవు. ఫిషింగ్ మెయిల్‌లు, సందేశాలు, సోషల్ మీడియా ప్రొఫైల్‌లను కాపీ చేయడానికి ఈ సాధనాలు ఉపయోగిస్తున్నారు.

ఈ సాధనాలు మీ వీడియో, ఆడియో క్లిప్‌లను కాపీ చేయడం ద్వారా మీ వాయిస్, ముఖాన్ని క్లోన్ చేయగలవు. మీరు హ్యాకింగ్, ఫిషింగ్ మెయిల్ లేదా డీప్‌ఫేక్ వీడియో కాల్ ద్వారా ఏదైనా మోసానికి గురైతే, మీరు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ – 1930కి కాల్ చేయాలి.

కాల్ వచ్చిన నంబర్, క్లోన్ ఉన్న వ్యక్తి వంటి మొత్తం సమాచారాన్ని అందించండి. మీతో మాట్లాడినట్టు చెబుతున్న మీ పరిచయస్తుని వివరాలతో పాటు మీరు డబ్బు పంపిన వివరాలు అన్నీ చెప్పండి. మీ డబ్బు క్రెడిట్ అయినా ఎకౌంట్ ఖాతా 48 గంటలపాటు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరపకుండా నిలిపివేస్తారు.





























