బాహుబలి ఇచ్చిన నమ్మకంతో కేజీఎఫ్ 2 బడ్జెట్‌ను భారీగా పెంచేశారు కన్నడ మేకర్స్. తొలి భాగం ఘన విజయం సాధించటంతో, వందల కోట్ల వసూళ్లు మన స్క్రీన్ మీద సాధ్యమే అన్న నమ్మకం రావటంతో... యష్ మార్కెట్‌ను మించి ఖర్చు చేసి సక్సెస్ అయ్యారు కన్నడ నిర్మాతలు. ఆ తరువాత కూడా ఒక్కో సినిమాతో బడ్జెట్ లెక్కలు మారిపోతున్నాయి. ట్రిపులార్, బ్రహ్మాస్త్ర, పఠాన్ సినిమల బడ్జెట్ 500 కోట్లకు పైనే. అంత భారీగా తెరకెక్కించారు కాబట్టే ఈ సినిమాలు గ్లోబల్ రేంజ్‌లో సందడి చేశాయి. ఈ సినిమాల్లోనూ ఒకటి రెండు మాత్రమే వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేశాయి.