Bread Badusha: బ్రెడ్ తో బాదుషాను ఇలా ట్రై చేయండి.. టేస్ట్ చేస్తే అస్సలు వదిలి పెట్టరు!!

ఇప్పటికే మనం బ్రెడ్ తో చేసే చాలా ఐటెమ్స్ ని తెలుసుకున్నాం. బ్రెడ్ తో ఏ ఐటెమ్ చేసినా చాలా ఫాస్ట్ గా, అతి తక్కువ సయమంలోనే అయిపోతాయి. బ్రెడ్ కూడా ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యం. బ్రెతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వైట్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్ అయితే హెల్త్ కి చాలా మంచిది. పిల్లలకు కూడా బ్రౌన్ బ్రెడ్ ను ఇవ్వొచ్చు. అయితే మరీ ఎక్కువగా తీసుకోకూడదు. ఇప్పటికే స్నాక్స్, కర్రీస్, స్వీట్స్ ఎలా తయారు చేయాలో చూశాం. ఇప్పుడు బ్రెడ్ తో బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బ్రెడ్ తో చేసే బాదుషాలను నోట్లో అలా వేసుకుంటే చాలు స్మూత్ గా కరిగిపోతాయి. బ్రెడ్ బాదుషా..

Bread Badusha: బ్రెడ్ తో బాదుషాను ఇలా ట్రై చేయండి.. టేస్ట్ చేస్తే అస్సలు వదిలి పెట్టరు!!
Bread Badshah
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 23, 2023 | 5:47 PM

ఇప్పటికే మనం బ్రెడ్ తో చేసే చాలా ఐటెమ్స్ ని తెలుసుకున్నాం. బ్రెడ్ తో ఏ ఐటెమ్ చేసినా చాలా ఫాస్ట్ గా, అతి తక్కువ సయమంలోనే అయిపోతాయి. బ్రెడ్ కూడా ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యం. బ్రెతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వైట్ బ్రెడ్ బదులు బ్రౌన్ బ్రెడ్ అయితే హెల్త్ కి చాలా మంచిది. పిల్లలకు కూడా బ్రౌన్ బ్రెడ్ ను ఇవ్వొచ్చు. అయితే మరీ ఎక్కువగా తీసుకోకూడదు. ఇప్పటికే స్నాక్స్, కర్రీస్, స్వీట్స్ ఎలా తయారు చేయాలో చూశాం. ఇప్పుడు బ్రెడ్ తో బాదుషా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బ్రెడ్ తో చేసే బాదుషాలను నోట్లో అలా వేసుకుంటే చాలు స్మూత్ గా కరిగిపోతాయి. బ్రెడ్ బాదుషా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

బ్రెడ్, పంచదార, యాలకుల పొడి, పాలు, నీళ్లు, నూనె, నిమ్మ రసం

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ముందుగా బ్రెడ్ కు చుట్టూ ఉంచే అంచులను తీసేసి, మధ్యలో ఉన్న దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని వాటిని మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ లో కొద్ది కొద్దిగా పాలు పోస్తూ పిండిలా చేసుకోవాలి. ఇందులో నెయ్యి కూడా వేసి బాగా కలుపుకుని ఓ పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఓ గిన్నెలో పంచదార, నీళ్లు, యాలకులు వేసి పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఓ ఐదు నిమిషాలు ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో నిమ్మ రసం పిండుకుని మూత పెట్టాలి. నెక్ట్స్ స్టవ్ మీద డీప్ ఫ్రైకు సరిపడగా నూనె పెట్టుకోవాలి.

ఈ లోపు పక్కు పెట్టుకున్న పిండిని చిన్న ఉండల్లా చేసుకోవాలి. వీటిని మధ్యలోకి ప్రెస్ చేసి రౌండ్ గా చేసుకోవాలి బాదుషా షేప్ లాగా చేసుకోవాలి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్నా.. బాదుషాలను నూనెలో వేసుకుని రెండు వైపులా ఎర్రగా అయ్యేంత వరకూ కాల్చుకోవాలి. ఆ తర్వాత వీటిని పంచదార పాకంలో మునిగేంత వరకూ వేసి రెండు, మూడు గంటల పాటు మూత పెట్టి ఉంచాలి. ఆ తర్వాత ప్లేట్స్ లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే బ్రెడ్ బాదుషా రెడీ. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా, స్మూత్ గా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో