Mosquitoes: ఇంట్లోకి దోమలు ఎక్కువగా రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి!!

ఏ కాలమైనా.. సమయమైనా దోమలు బెడత మాత్రం తప్పదు. అందులోనూ వానా కాలం వచ్చిందంటే.. గుంపులు గుంపులుగా దోమలు వచ్చి దాడి చేస్తూనే ఉంటాయి. వస్తూ రోగాలను కూడా మోసుకొస్తూ ఉంటాయి. దోమలు కుట్టాయంటే పెద్దవాళ్లే అనారోగ్య పాలవుతారు. ఇక పిల్లల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటివి.. దోమలు కుట్టడం వల్లనే వస్తాయి. ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. ఎటాక్ చేస్తూనే ఉంటాయి దోలు. దీంతో ఇంట్లోని వారు లోషన్లు, క్రీములు, స్ప్రేలు, దోమల బ్యాట్ లు, ఆల్ అవుట్, దోమల చక్రాలు వంటి వాటిని సిద్ధం చేసుకుంటారు. అయితే కొన్ని రకాల..

Mosquitoes: ఇంట్లోకి దోమలు ఎక్కువగా రాకుండా ఉండాలంటే.. ఇలా చేయండి!!
Mosquitos
Follow us

|

Updated on: Sep 23, 2023 | 3:09 PM

ఏ కాలమైనా.. సమయమైనా దోమలు బెడత మాత్రం తప్పదు. అందులోనూ వానా కాలం వచ్చిందంటే.. గుంపులు గుంపులుగా దోమలు వచ్చి దాడి చేస్తూనే ఉంటాయి. వస్తూ రోగాలను కూడా మోసుకొస్తూ ఉంటాయి. దోమలు కుట్టాయంటే పెద్దవాళ్లే అనారోగ్య పాలవుతారు. ఇక పిల్లల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటివి.. దోమలు కుట్టడం వల్లనే వస్తాయి. ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. ఎటాక్ చేస్తూనే ఉంటాయి దోలు. దీంతో ఇంట్లోని వారు లోషన్లు, క్రీములు, స్ప్రేలు, దోమల బ్యాట్ లు, ఆల్ అవుట్, దోమల చక్రాలు వంటి వాటిని సిద్ధం చేసుకుంటారు. అయితే కొన్ని రకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల దోమలు రావంట. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

బంతి పువ్వు:

బంతి పువ్వులో ఘాటు వాసన ఉంటుంది. ఈ ఘాటు వాసనకు దోమలు దూరంగా ఉంటాయి. కాబట్టి ఇంట్లో బంతి పూల మొక్క ఉంటే.. దోమలు రావు.

ఇవి కూడా చదవండి

గుర్రపు డెక్క:

పల్లెటూర్లలో ఉండే వాళ్లకు గుర్రపు డెక్క గురించి తెలుస్తుంది. ఇది కాలువల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్క యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ మొక్క నుంచి కూడా ఒక లాంటి ఘాటు వాసన వస్తుంది. ఈ వాసన ప్రభావంతో కూడా దోమలు దూరంగా ఉంటాయి.

వేప:

వేపలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. వీటి గురించి ప్రత్యేకగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంట్లో చిన్న కుండీల్లో వేప మొక్కను పెట్టుకున్నా కూడా దోమలు ఇంట్లోకి రావు.

తులసి:

తులసి మొక్కను కూడా ఇంట్లో పెట్టుకుంటే దోమలు దూరంగా ఉంటాయి. చుట్టూ ఉన్న పర్యావరణాన్ని తులసి శుద్ధి చేస్తుంది. ఈ కారణంగా దోమలు దూరంగా ఉంటాయి.

క్యాట్నిప్:

పుదీనా కుటుంబానికి చెందిన క్యాట్నిప్ అనే మొక్క విశేషం ఏంటంటే ఇది సూర్యని వెలుతురు, నీడలో కూడా పెరుగుతుంది. ఈ మొక్క నుంచి కూడా ఘాటు వాసనలు వస్తూ ఉంటాయి. దీనికి కూడా దోమలు దూరంగా ఉంటాయి.

అజెరాటం:

దోమలు, కీటకాలు రాకుండా చేసే మొక్కల్లో అజెరాటం కూడా ఒకటి. ఈ మొక్కకు బ్లూ లేదా వైట్ కలర్ లో పువ్వులు ఉంటాయి. ఇది కూడా ఒకలాంటి ఘాటు వాసనను కలిగి ఉంటుంది. కాబట్టి ఈ మొక్క ఉన్న ప్రాంతానికి కూడా దోమలు దూరంగా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
డ్రగ్స్‌ కేస్‌ అప్డేట్.. గుడ్ న్యూస్ చెప్పిన హేమ.! వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
రిలీజ్‌ అవ్వని సినిమాకి టికెట్స్ అడగడం ఏంట్రా.! సుహాస్ వీడియో..
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
అచ్చం పవన్‌ కళ్యాణ్ ను గుర్తు చేసిన తేజు! విజయవాడలో సుప్రీమ్ హీరో
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
ధనుష్ పై నిషేధం ఎత్తివేసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్.!
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
దారుణం.! నాగమణికంఠ భార్యపై బాడీ షేమింగ్ కామెంట్స్..
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
హార్దిక్ ముందే బాయ్‌ఫ్రెండ్‌తో చక్కర్లు కొడుతున్న మాజీ భార్య.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
సూపర్ న్యూస్.! NTR వైపే అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం.!
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రూ.50 కోట్లు గెల్చుకునే ఛాన్స్! డిజిటల్ లాటరీని ప్రారంభించిన సీఎం
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
రాత్రి సమయంలో అంబులెన్స్‌కు పంక్చర్.. సాయం చేసేందుకు వెళ్లగా...
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ