AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cleaning Tips: మీ బాత్రూమ్ ఎప్పుడూ క్లీన్ గా, సువాసనగా ఉండాలా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!!

బాత్రూమ్ దీని పేరు ఎత్తితేనే.. చాలా మందికి నచ్చదు. మల, మూత్ర విసర్జన అన్నీ అక్కడే జరుగుతాయి. పని మీద బయటకు వెళ్లినప్పుడు కూడా బాత్రూమ్ ని వినియోగించడం ఎవరికీ ఇష్టం ఉండదు. దీంతో వాటర్ తాగడం, ఆహారం తీసుకోవడం తగ్గించేస్తారు. కానీ కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల మీ వాష్ రూమ్ ను క్లీన్ గా, బ్యాడ్ స్మెల్ లేకుండా, అందంగా మార్చుకోవచ్చు. నిజం చెప్పాలంటే వాష్ రూమ్ చాలా క్లీన్ గా ఉంచుకోవాలి. ఎందుకంటే అక్కడే బ్యాక్టీరియా, క్రిములు అనేవి..

Cleaning Tips: మీ బాత్రూమ్ ఎప్పుడూ క్లీన్ గా, సువాసనగా ఉండాలా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!!
Bathroom
Chinni Enni
|

Updated on: Sep 23, 2023 | 2:15 PM

Share

బాత్రూమ్ దీని పేరు ఎత్తితేనే.. చాలా మందికి నచ్చదు. మల, మూత్ర విసర్జన అన్నీ అక్కడే జరుగుతాయి. పని మీద బయటకు వెళ్లినప్పుడు కూడా బాత్రూమ్ ని వినియోగించడం ఎవరికీ ఇష్టం ఉండదు. దీంతో వాటర్ తాగడం, ఆహారం తీసుకోవడం తగ్గించేస్తారు. కానీ కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల మీ వాష్ రూమ్ ను క్లీన్ గా, బ్యాడ్ స్మెల్ లేకుండా, అందంగా మార్చుకోవచ్చు. నిజం చెప్పాలంటే వాష్ రూమ్ చాలా క్లీన్ గా ఉంచుకోవాలి. ఎందుకంటే అక్కడే బ్యాక్టీరియా, క్రిములు అనేవి ఎక్కువగా ఉంటాయి. బాత్రూమ్స్ క్లీన్ గా లేకపోయినా జబ్బులు పడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి.

డస్ట్ బిన్ కంపల్సరీ:

బాత్రూమ్ లో కూడా డస్ట బిన్ తప్పనిసరిగా ఉంచుకోవాలి. పేపర్ నాప్ కిన్స్, టిష్యూ పేపర్స్, షాంపూ కవర్స్, సబ్బు కవర్స్ వంటికి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఆ డస్ట్ బిన్ కూడా రోజూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

వాష్ రూమ్ లో సువాసన రావాలంటే ఇలా చేయండి:

చాలా మంది వాష్ రూమ్స్ ని ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. అలాంటి వారు.. బాత్రూమ్ ని క్లీన్ చేసేటప్పుడు.. మీరు వాడే బాడీ స్ప్రేని ఉపయోగించవచ్చు. అలాగే బాత్ రూమ్ లో బ్యాడ్ స్మెల్ పోవాలంటే మంచి సువాసన వచ్చే కొవ్వుత్తులను ఉపయోగించవచ్చు. సువాసన వచ్చే కొవ్వుత్తిని వెలిగించి ఒకటి బాత్ రూమ్ లో పక్కకు పెట్టుకోవచ్చు.

పేపర్ రోల్:

బాత్రూమ్ లో కంపల్సరీగా పేపర్ రోల్ ఉండేలా చూసుకోవాలి. దానికి ఘాడత ఎక్కువగా ఉన్న పెర్ఫ్యూమ్ లేదా ఎసెన్సియల్ ఆయిల్ చుక్కలని వేయండి. ఇలా చేసినా కూడా బాత్ రూమ్ లో మంచి సువాసన వస్తుంది.

వెంటిలేషన్ ఉండాలి:

మీరు యూజ్ చేస్తున్న బాత్ రూమ్ కి తగినంత వెంటిలేషన్ ఉండేలా చూడాలి. అప్పుడు అందులో ఉండే బ్యాడ్ స్మెల్ బయటకు పోతుంది. అలాగే ఎండ తగిలితే బ్యాక్టీరియా వంటివి ఏమైనా ఉన్నా నశిస్తాయి.

బాత్ రూమ్ ని తరుచుగా క్లీన్ చేయాలి:

చాలా మంది పది రోజులకు లేదా రెండు వారాలకు ఒకసారి క్లీన్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మూడు, నాలుగు రోజులకొకసారి క్లీన్ చేస్తూ ఉంటే నీటిగా ఉంటుంది.

డెటాల్:

మీరు బాత్ రూమ్ ని క్లీన్ చేసేటప్పుడు డెటాల్ ను కూడా ఉపయోగించవచ్చు. దీనివల్ల బ్యాక్టీరియా, క్రిములు ఏమైనా ఉంటే నశిస్తాయి.

ఈ టిప్స్ పాటించడం వల్ల బాత్ రూమ్ ఎప్పుడూ క్లీన్ గా, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?