AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Custard Apple: షుగర్ ఉన్నవాళ్లు సీతాఫలం తినకూడదా? తింటే ఏం జరుగుతుంది!!

ప్రస్తుతం చాలా మంది ఇప్పుడు డయాబెటీస్ తో బాధ పడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలోనే షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి కూడా డయాబెటీస్ అనేది పెద్ద సమస్యగా మారింది. 30 ఏళ్లు ఉన్నవారికి కూడా మధుమేహం రావడం దారుణమైన పరిస్థితి. బిజీ లైఫ్ కారణంగా మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా ఈ షుగర్ వ్యాధి వస్తుందని..

Custard Apple: షుగర్ ఉన్నవాళ్లు సీతాఫలం తినకూడదా? తింటే ఏం జరుగుతుంది!!
Custard Apple
Chinni Enni
|

Updated on: Sep 23, 2023 | 2:00 PM

Share

ప్రస్తుతం చాలా మంది ఇప్పుడు డయాబెటీస్ తో బాధ పడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలోనే షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి కూడా డయాబెటీస్ అనేది పెద్ద సమస్యగా మారింది. 30 ఏళ్లు ఉన్నవారికి కూడా మధుమేహం రావడం దారుణమైన పరిస్థితి. బిజీ లైఫ్ కారణంగా మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా ఈ షుగర్ వ్యాధి వస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే డయాబెటీస్ వచ్చిన వారు కొన్ని రకాల ఆహారాలకు చాలా దూరంగా ఉండాలి. లేదంటే వారి ప్రాణానికే ప్రమాదం. అందులో సీతాఫలం కూడా ఒకటి. మధుమేహం ఉన్నవారు సీతా ఫలం తినకూడదని కొందరు అంటూంటారు. అందలో నిజమెంత? అబద్ధమెంతనో తెలుసుకుందాం.

సీతాఫలం.. షుగర్ వ్యాధిగ్రస్తులు తినొచ్చా?

సీతా ఫలాలు తియ్యగా ఎంతో టేస్టీగా ఉంటాయి. వీటిని చూడగానే తినాలనిపిస్తుంది. సీతాఫలం తింటే ఎంతో ఆరోగ్యం కూడా. ఎందుకంటే ఇవి సీజనల్ గా దొరికే పండ్లు కాబట్టి.. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. విటమిన్ బి6, పోటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటివి ఉంటాయి. అలాగే సీతా ఫలంలో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహ ఉన్న వారు ఎలాంటి భయం లేకుండా సీతా ఫలాన్ని తినవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎలాంటి వారైనా తినొచ్చు:

సీతా ఫలంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సీతా ఫలాన్ని ఎలాంటి వారైనా.. ఎలాంటి సంకోచం లేకుండా తినవచ్చు. గుండె జబ్బులు ఉన్న వారు, లావుగా ఉన్నవారు, పాలిసిస్టిక్ ఓవరీ సండ్రోమ్ తో ఇబ్బంది పడుతున్న వారు కూడా నిస్సహందేహంగా తినవచ్చు.

అరుగుదల:

సీతాఫలం తింటే అరుగుదల సమస్యలు ఉండవు. జీవ క్రియ కూడా సక్రమంగా జరుగుతుంది. దీంతో మలబద్ధకం సమస్యలు, ఎసిడిటీ, గ్యాస్ వంటి వాటికి చెక్ పెట్టవచ్చు.

కంటికి ఆరోగ్యం:

సీతాఫలంలో కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచే గుణాలు మెండుగా ఉంటాయి. దీంతో కంటి సమస్యలు దరిచేరవు. అలాగే కంటి శుక్లాల సమస్యలు కూడా ఉండవు.

హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగు పరుస్తుంది:

హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగు పరచడంలో సీతా ఫలం హెల్ప్ చేస్తుంది. దీంతో రక్త హీనత సమస్య కూడా ఉండవు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..