AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాకరతో డయాబెటీస్ మాత్రమే కాదు ఇంకా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు!

మనం నిత్యం వంటగదిలో ఉపయోగించే వాటిల్లో కాకర కాయ ఒకటి. కాకరకాయ పేరు ఎత్తగానే అమ్మో కాకరకాయ.. చేదు అంటూంటారు. కాకరకాయని ఎంత రుచిగా చేసినా కూడా దీన్ని ఎవరూ పట్టించుకోరు. కానీ ఇందులో ఉండే ఔషధ గుణాలతో ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులను, అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలీదు. నాలుక రుచిని చూస్తాం కానీ.. మన శరీరానికి కావాల్సిన ప్రయోజనాల గురించి మాత్రం పట్టించుకోం. అలాగే ఎంతో టేస్టీగా ఉండే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కోసం ఎగబడతాం. ముఖ్యంగా ఈ కాకరకాయ డయాబెటీస్ ని మాత్రమే..

కాకరతో డయాబెటీస్ మాత్రమే కాదు ఇంకా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు!
Bitter Gourd
Chinni Enni
|

Updated on: Sep 16, 2023 | 5:01 PM

Share

మనం నిత్యం వంటగదిలో ఉపయోగించే వాటిల్లో కాకర కాయ ఒకటి. కాకరకాయ పేరు ఎత్తగానే అమ్మో కాకరకాయ.. చేదు అంటూంటారు. కాకరకాయని ఎంత రుచిగా చేసినా కూడా దీన్ని ఎవరూ పట్టించుకోరు. కానీ ఇందులో ఉండే ఔషధ గుణాలతో ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులను, అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చన్న విషయం చాలా మందికి తెలీదు. నాలుక రుచిని చూస్తాం కానీ.. మన శరీరానికి కావాల్సిన ప్రయోజనాల గురించి మాత్రం పట్టించుకోం. అలాగే ఎంతో టేస్టీగా ఉండే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ కోసం ఎగబడతాం. ముఖ్యంగా ఈ కాకరకాయ డయాబెటీస్ ని మాత్రమే కంట్రోల్ చేస్తుందనుకుంటారు. నిజమే.. కానీ షుగర్ తో పాటు కాకర కాయని సరిగ్గా వాడితే చాలా విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది.

కాకరలో విటమిన్ ఏ, బీ, సీ, బీటా కెరోటిన్ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే జింక్, మాంగనీస్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటివి కూడా మనకు లభిస్తాయి. కాకర కాయను క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టేయవచ్చు. సీజనల్ వ్యాధులైన జలుబు, దగ్గు, జ్వరాలను కూడా దరి చేరనీయదు కాకరకాయ. అంత రోగ నిరోధక శక్తి కాకర కాయలో ఉంది.

బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో చేస్తుంది:

ఇవి కూడా చదవండి

చేదుగా ఉన్న వాటిని తింటే.. మన శరీరంలో న్యూరో సెంటర్ మెకానిజంపై ప్రభావం చూపిస్తుంది. దీంతో చేదు ఐటెమ్స్ వంటి వాటిని తీసుకుంటే హార్మోన్స్ లో రెస్పాన్స్ వస్తుంది. ఈ విధంగా బ్లడ్ షుగర్ లెవల్స్ మారుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే కాకర కాయ జ్యూస్ తాగితే.. డయాబెటీస్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది:

చేదుగా ఉందని పక్కన పెట్టకుండా ముందే కొద్ది కొద్దిగా కాకర కాయను తినడం అలవాటు చేసుకుంటే చాలా బెటర్. మన ఆరోగ్యం గురించి మనమే శ్రద్ధ తీసుకోవాలి. కాకర కాయను తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటైన క్యాన్సర్ ను కూడా తగ్గిస్తుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:

మనకు ప్రకృతి ప్రసాదించిన నేచురల్ ఫుడ్స్ లో కాకరకాయ ఒకటి. కాకరను తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను లెవల్స్ ను తగ్గిస్తుంది. అంతే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది కాకర. అలాగే బ్లడ్ సర్క్యూలేషన్ కూడా మెరుగు పరుస్తుంది.

బరువును తగ్గించుకోవచ్చు:

కాకర కాయతో అధిక బరువు కూడా చెక్ పెట్టవచ్చు. కాకర కాయలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దీంతో తిన్న ఆహారం పేరుకుపోకుండా త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే నడుము చుట్టూ ఉన్న కొవ్వును కూడా కరిగిస్తుంది కాకర.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.