Aloo Bites Recipe: ఆలుగడ్డతో ఇలా స్నాక్స్ చేసుకుని తినండి.. ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే!!

చాలా మందికి డీప్ ఫ్రై స్నాక్స్ అంటే చాలా ఇష్టం. సాయంత్రం అవ్వగానే ఏదో ఒకటి తినాలని అనుకుంటారు. దీంతో బయట దొరికే ఐటెమ్స్ ని లాగించేస్తారు. వాళ్లు ఏ నూనె వాడారో.. ఎలా తయారు చేస్తారో తెలీదు. అనంతరం అనారోగ్య సమస్యలతో సతమతమవుతూంటారు. అదే ఇంట్లోనే హెల్దీగా చేసుకుని తింటే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మన సొంతమవుతుంది. అందులోనూ ఆలు గడ్డతో ఏ ఐటెమ్ చేసినా సూపర్ టేస్ట్ ఉంటాయి. తక్కువ సమయంలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆలూతో సింపుల్ గా తయారు చేసుకునే..

Aloo Bites Recipe: ఆలుగడ్డతో ఇలా స్నాక్స్ చేసుకుని తినండి.. ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే!!
Aloo Bites
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 20, 2023 | 10:15 PM

చాలా మందికి డీప్ ఫ్రై స్నాక్స్ అంటే చాలా ఇష్టం. సాయంత్రం అవ్వగానే ఏదో ఒకటి తినాలని అనుకుంటారు. దీంతో బయట దొరికే ఐటెమ్స్ ని లాగించేస్తారు. వాళ్లు ఏ నూనె వాడారో.. ఎలా తయారు చేస్తారో తెలీదు. అనంతరం అనారోగ్య సమస్యలతో సతమతమవుతూంటారు. అదే ఇంట్లోనే హెల్దీగా చేసుకుని తింటే.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం మన సొంతమవుతుంది. అందులోనూ ఆలు గడ్డతో ఏ ఐటెమ్ చేసినా సూపర్ టేస్ట్ ఉంటాయి. తక్కువ సమయంలోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆలూతో సింపుల్ గా తయారు చేసుకునే స్నాక్స్ లో క్రిస్పీ బైట్స్ ఒకటి. దీన్ని ఎవరైనా, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామా.

క్రిస్పీ ఆలూ బైట్స్ కి కావాల్సిన పదార్థాలు:

ఉడికించిన బంగాళదుంపలు – 3, బియ్యం పిండి – 3 టీ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ – రెండు టీ స్పూన్స్, ఉప్పు – రుచికి సరిపడినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, కారం – ఒక టీ సపూన్, గరం మసాలా – అర టీ స్పూన్, చిన్నగా మిరియాల పొడి – పావు టీస్పూన్, తరిగిన కొత్తిమీర, కరివేపాకు – కొద్దిగా, బ్రెండ్ క్రంబ్స్ – అర కప్పు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడినంత.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ముందుగా ఒక కళాయిలో నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. ఈలోపు ఉడికించిన బంగాళ దుంపలను తురిమి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులో కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రంబ్స్ తప్పించి.. మిగతా అన్ని పదార్థాలు, తగిననన్ని నీళ్లు పోసి.. బైట్స్ వచ్చేలా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె లేదా నెయ్యి రాసుకుంటూ మీకు నచ్చిన ఆకారంలో బైట్స్ ని సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత వీటిని కార్న్ ఫ్లోర్ వాటర్ లో ముంచి.. ఆ తర్వాత బ్రెడ్ క్రంబ్స్ లో కోటింగ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న వాటిని.. నూనెలో వేసి.. బాగా వేగాక ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ ఆలూ బైట్స్ రెడీ. వీటిని టమాటా సాస్ తో తింటే భలే రుచిగా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!