Green Chilies Benefits: పచ్చి మిర్చితో లాభాలే కానీ నష్టాలు లేవండోయ్..! గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది!

పురాతన కాలం నుంచి వంటల్లో పచ్చి మిర్చి వాడకం ఉంది. ఏది తింటే ఆరోగ్యానికి మంచిదో పెద్దలు అప్పుడే చెప్పారు. కానీ మనం వాటిని పట్టించుకోవడం లేదు. భారత దేశంలో పచ్చి మిర్చికి ఉండే డిమాండే వేరు. పచ్చి మిర్చి కారంగా ఉంటుందని చాలా మంది దాని వాడకాన్ని తగ్గించేస్తారు. వంటల్లో రుచిని తీసుకురావడంలో పచ్చిమిర్చి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. వీటిని చట్నీల్లో, పప్పుల్లో, మసాలా వంటకాల్లో, పచ్చళ్లులలో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. నిజానికి పచ్చి మిర్చి వల్ల..

Green Chilies Benefits: పచ్చి మిర్చితో లాభాలే కానీ నష్టాలు లేవండోయ్..! గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది!
Green Chil
Follow us

|

Updated on: Sep 16, 2023 | 5:29 PM

పురాతన కాలం నుంచి వంటల్లో పచ్చి మిర్చి వాడకం ఉంది. ఏది తింటే ఆరోగ్యానికి మంచిదో పెద్దలు అప్పుడే చెప్పారు. కానీ మనం వాటిని పట్టించుకోవడం లేదు. భారత దేశంలో పచ్చి మిర్చికి ఉండే డిమాండే వేరు. పచ్చి మిర్చి కారంగా ఉంటుందని చాలా మంది దాని వాడకాన్ని తగ్గించేస్తారు. వంటల్లో రుచిని తీసుకురావడంలో పచ్చిమిర్చి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. వీటిని చట్నీల్లో, పప్పుల్లో, మసాలా వంటకాల్లో, పచ్చళ్లులలో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. నిజానికి పచ్చి మిర్చి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే పచ్చి మిర్చిని అస్సలు దూరం పెట్టరు.

ఆయుర్వేదంలో కూడా పచ్చి మిర్చి కొన్ని వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తూంటారు. అలాగే వీటిల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. పచ్చిమిర్చి జీర్ణ శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. కానీ ఏదైనా మితంగా వాడితేనే అమృతం.. అంతకు మించి వాడితే విషమన్న సంగతి తెలుసుకోవాలి. కాబట్టి పరిమితి ప్రకారం ఏది వాడినా అది ఆరోగ్యానికి మంచే తప్ప కీడు చేయదు. ఈ విషయం పక్కకు పెడితే పచ్చి మిర్చితో ఎలాంటి శరీరానికి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో, ఎలా వాడాలో తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యం:

ఇవి కూడా చదవండి

పచ్చి మిర్చి రక్త పోటును, కొలెస్ట్రాల్ ను స్థాయిలను తగ్గించడంలో సహాయ పడుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిని మితంగా తీసుకుంటే మాత్రం గుండె పని తీరు ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ లెవల్స్ ను కంట్రోల్ లోకి తీసుకువస్తుంది.

విటమిన్లు పుష్కలంగా:

పచ్చి మిరపకాయల్లో విటమిన్లు ఏ, సి వంటికి మెండుగా ఉంటాయి. అలాగే దీనిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పచ్చి మిర్చి తింటే బాడీలో ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. విటమిన్ ఏ కంటి చూపును మెరుగు పరచడంలో హెల్ప్ చేస్తుంది. విటమిన్ సి చర్మ రక్షణకు సహకరిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ:

పచ్చి మిర్చిలో విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఒత్తిడిని, ఆందోళనను ఎదుర్కొనడంలో సహాయం చేస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. వీటిల్లో ఉండే పోషకాలు చెమటను ప్రొత్సహిస్తాయి. ఈ చెమట వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్తాయి.

నొప్పిని తగ్గిస్తుంది:

పచ్చి మిరపకాయలో ఉండే కొన్ని రకాల సమ్మేళనాలు నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా నొప్పిని తగ్గించే క్రీములు, ఆయింట్ మెంట్లలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఆర్థరైటీస్, న్యూరోపతిలో నొప్పిని తగ్గించడంలో పచ్చి మిర్చి సహాయ పడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
లోన్ కట్టమని రికవరీఏజెంట్స్ వేధిస్తున్నారా?ఈ టిప్స్‌తో సమస్య ఫసక్
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
వీటితో మీ ఇల్లు సేఫ్‌.. రూ. 1500 లోపు బెస్ట్ సీసీటీవీ కెమెరాలు..
అలాంటి వాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకూడదా..? ఒకవేళ తింటే..
అలాంటి వాళ్లు గుడ్డులోని పచ్చసొన తినకూడదా..? ఒకవేళ తింటే..
కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
కాంగ్రెస్ సంబరాలు.. కమలం వ్యూహాలు.. ఆ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్..
కెప్టెన్‌గా ప్రమోషన్.. ఆ వెంటనే బిగ్ షాకిచ్చిన గంభీర్
కెప్టెన్‌గా ప్రమోషన్.. ఆ వెంటనే బిగ్ షాకిచ్చిన గంభీర్
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అదిరే లాభాలు..!
ఆ రెండు పథకాల్లో పెట్టుబడితో అదిరే లాభాలు..!
టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండగా రైలు ప్రయాణం చేస్తున్నారా?
టికెట్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉండగా రైలు ప్రయాణం చేస్తున్నారా?
బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి
బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టి
అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు ఇవి..
అన్ లిమిటెడ్ 5జీ డేటా కోసం ఎయిర్ టెల్ కొత్త డేటా బూస్టర్లు ఇవి..
ఫార్చ్యూనర్‌కు పోటీగా నిస్సాన్ నయా కార్ లాంచ్.. !
ఫార్చ్యూనర్‌కు పోటీగా నిస్సాన్ నయా కార్ లాంచ్.. !