Onion Pickle: ఒక్క డ్రాప్ ఆయిల్ వాడకుండా ఉల్లిపాయ నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే అదిరిపోతుంది!

ప్రస్తుతం ఆరోగ్యంపై ఫోకస్ తో కొంత మంది వంట నూనెకు కూడా దూరంగా ఉంటున్నారు. వీలైనంత వరకూ చాలా తక్కువగా వాడుతున్నారు. నూనె లేకుండా ఉన్న ఫుడ్స్ ను కూడా ఇష్ట పడుతున్నారు. అలాంటి వారికి బెస్ట్ ఆప్షన్ ఉల్లిపాయ పచ్చడి. ఇది ఎక్కువగా పంజాబి ధాబాలలో లేదా నార్త్ ఇండియా రెస్టారెంట్ లలో కనిపిస్తూ ఉంటుంది. రోటి, చపాతి వంటి వాటికి సైడ్ డిష్ గా వడ్డిస్తూంటారు. ఇది చేయడం కూడా చాలా సులభమే..

Onion Pickle: ఒక్క డ్రాప్ ఆయిల్ వాడకుండా ఉల్లిపాయ నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే అదిరిపోతుంది!
Onion Pickle
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 20, 2023 | 9:45 PM

ప్రస్తుతం ఆరోగ్యంపై ఫోకస్ తో కొంత మంది వంట నూనెకు కూడా దూరంగా ఉంటున్నారు. వీలైనంత వరకూ చాలా తక్కువగా వాడుతున్నారు. నూనె లేకుండా ఉన్న ఫుడ్స్ ను కూడా ఇష్ట పడుతున్నారు. అలాంటి వారికి బెస్ట్ ఆప్షన్ ఉల్లిపాయ పచ్చడి. ఇది ఎక్కువగా పంజాబి ధాబాలలో లేదా నార్త్ ఇండియా రెస్టారెంట్ లలో కనిపిస్తూ ఉంటుంది. రోటి, చపాతి వంటి వాటికి సైడ్ డిష్ గా వడ్డిస్తూంటారు. ఇది చేయడం కూడా చాలా సులభమే. ఉల్లి పాయలను, పచ్చి మిర్చిని సైడ్ డిష్ గా తినే వారికి ఇది బాగా నచ్చుతుంది. మరి ఈ ఉల్లి పాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

చిన్న సైజు ఉల్లి పాయలు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, ఉప్పు, పటిక బెల్లం, బీట్ రూట్, కరివేపాకు, అల్లం ముక్కలు, పచ్చి మిర్చి, వెనిగర్, నీళ్లు.

ఇవి కూడా చదవండి

ఉల్లి పాయ పచ్చడి తయారీ విధానం:

ఉల్లిపాయలపై పొట్టు తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత వాటికి నాలుగు వైపులా గాట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక గిన్నెలోకి నీటిని తీసుకుని వేడి చేసుకోవాలి. నీళ్లు వేడెక్కాక.. అందులో కరివేపాకు, అల్లం, పచ్చి మిర్చి, వెనిగర్ తప్ప మిగిలిన అన్ని పదార్థాలు వేసుకుని, మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆతర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పింగాణి లేదా గాజు సీసాలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి.

ఇందులో కరివేపాకు, అల్లం, పచ్చి మిర్చి, వెనిగర్ వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ముందుగా మరగబెట్టి పెట్టుకున్న నీటిని ఉల్లిపాయ మిశ్రమంలోకి వేయాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుని.. సీసా మూత గట్టిగా పెట్టుకుని రెండు రోజు పాటు అలాగే ఉంచాలి. ఈ పచ్చడి బాగా ఊరిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకోవచ్చు. వీటిని చపాతి, రోటీల్లోకి తింటే బలే టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. ఇది ఆరోగ్యానికి కూడా ఆరోగ్యమే.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..