AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Care: పాదాలు మురికిగా, అందవిహీనంగా ఉన్నాయా.. నచ్చిన చెప్పులను ధరించలేకపోతున్నారా! ఈ టిప్స్ మీకోసమే!

అందం అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి. మగవారైనా, ఆడవారైనా అందంగా ఉండాలి, పది మందిలో స్పెషల్ గా కనిపించాలని ఆరాట పడుతూంటారు. ఇదేం తప్పు కాదు. అయితే అందాన్ని పెంపొందించుకోవడంలో పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వాటిని పాటిస్తే మంచి ఆరోగ్యకరమైన అందం మీ సొంతం అవుతుంది. అలాగే చాలా మంది ముఖంపై పెట్టిన శ్రద్ధ వేరే ఇతర శరీర భాగాలపై అంతగా ఆసక్తి చూపించారు. అందులో పాదాలు ఒకటి. ముఖం అందంగా మెరిసిపోతూ కినిపించినా.. పాదాల విషయం వచ్చే సరికి మురికిగా, నల్లగా కనిపిస్తాయి. దానికి కారణం పాదాలపై సరైన జాగ్రత్త..

Beauty Care: పాదాలు మురికిగా, అందవిహీనంగా ఉన్నాయా.. నచ్చిన చెప్పులను ధరించలేకపోతున్నారా! ఈ టిప్స్ మీకోసమే!
Foot Care
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 20, 2023 | 10:00 PM

Share

అందం అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి. మగవారైనా, ఆడవారైనా అందంగా ఉండాలి, పది మందిలో స్పెషల్ గా కనిపించాలని ఆరాట పడుతూంటారు. ఇదేం తప్పు కాదు. అయితే అందాన్ని పెంపొందించుకోవడంలో పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వాటిని పాటిస్తే మంచి ఆరోగ్యకరమైన అందం మీ సొంతం అవుతుంది. అలాగే చాలా మంది ముఖంపై పెట్టిన శ్రద్ధ వేరే ఇతర శరీర భాగాలపై అంతగా ఆసక్తి చూపించారు. అందులో పాదాలు ఒకటి. ముఖం అందంగా మెరిసిపోతూ కినిపించినా.. పాదాల విషయం వచ్చే సరికి మురికిగా, నల్లగా కనిపిస్తాయి. దానికి కారణం పాదాలపై సరైన జాగ్రత్త వహించరు. మరి అసలు ఎక్కువగా పాదలే ఎండకు ఎక్కువగా ఎక్స్ పోజ్ అవుతాయి. దీంతో పాదాలపై దుమ్మూ, ధూళి బాగా పేరుకు పోతుంది. వీటిని సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే అవి నల్లగా మారతాయి. దీంతో సరైన చెప్పులను కూడా ధరించలేకపోతూ ఉంటారు. పాదాలకు కూడా చిన్న టిప్స్ పాటిస్తే సరి.. వాటిని కూడా శుభ్రంగా ఉంచుకోవచ్చు. మరి పాదాలు కూడా తెల్లగా, అందంగా కనిపించాలంటే ఈ కింది చిట్కాలను పాటించండి.

స్క్రబింగ్ చేయాలి:

ముందు పాదాలపై ఉన్న మురికి, డెడ్ స్కిన్ సెల్స్ పోవాలంటే వాటికి స్క్రబింగ్ అవసరం. మరి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా.. ఇంట్లో ఉండే పంచదార, నిమ్మకాయను తీసుకోండి. నెక్ట్స్ పాదాలను శుభ్రంగా కడిగి గోరు వెచ్చటి నీటిలో ఉంచాలి. ఆ తర్వాత నిమ్మ చెక్క ను పంచదారపై అద్ది.. దాన్ని పాదాలపై రుద్దాలి. ఇలా ఓ ఐదు నుంచి 10 నిమిషాల పాటు చేయాలి. ఆ తర్వాత పాదాలను శుభ్రంగా కడిగేసుకోవాలి. నెక్ట్స్ మంచి మాయిశ్చరైజర్ ను సెలక్ట్ చేసుకుని దాన్ని పాదాలకు అప్లై చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మీ పాదాలు శుభ్రంగా ఉంటాయి. బయటకు వెళ్లిన ప్రతిసారీ సన్ స్క్రీన్ లోషన్ ను అప్లై చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

పాలు-గులాబి:

పాదాలను శుభ్రంగా, అందంగా మార్చుకోవడంలో ఈ టిప్ కూడా బాగా ఉపయోగ పడుతుంది. ఒక టబ్ లో కొద్దిగా హాట్ వాటర్ ను పోసి.. అందులో గుప్పెడు గులాబి రేకులను, ఒక కప్పు పాలను వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ నీటిలో పాదాలను ఉంచి.. శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా అరగంట సేపు ఉంచుకోవాలి. పాదాలను ఇలా క్లీన్ చేసుకుంటే డెడ్ స్కిన్ సెల్స్ పోవడమే కాకుండా.. పాదాల రంగు కూడా మెరుగు పడుతుంది.

శనగపిండి ప్యాక్:

ఒక గిన్నెలో రెండు స్పూన్ల శనగపిండి, ఒక స్పూన్ టమాటా రసం, కీరా దోస రసం, రెండు స్పూన్ల నిమ్మ రసం వేసి.. దీన్ని పేస్ట్ లా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లను వాడవచ్చు. ముందుగా పాదాలను శుభ్రంగా కడుక్కొని.. ఈ ప్యాక్ ను వేసుకోవాలి. ఈ ప్యాక్ బాగా ఆరిపోయాక.. శుభ్రం చేసుకోవడమే. అంతే ఇలాంటి వాటిని ఈజీగా ఇంట్లోనే ట్రై చేస్తే.. పాదాలు రంగు మారుతూ ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.