- Telugu News Photo Gallery Everything You Need To Know Health Benefits Of Corn And Its Nutritional Facts Telugu News
మొక్కజొన్న అంటే ఇష్టంతో అతిగా తింటున్నారా? అయితే ఈ లాభాలు పొందినట్లే..
మొక్కజొన్నలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మొక్కజొన్న ప్రధానంగా పంజాబ్, హర్యానా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో పండిస్తారు. మొక్కజొన్నలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియను సమర్థవంతంగా చేస్తుంది.
Updated on: Sep 20, 2023 | 4:35 PM

మొక్క జొన్నల్లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్, గ్లూటెన్‌లు మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, అనీమియా, గుండె వ్యాధులు లాంటివి రాకుండా నిరోధిస్తుంది. ఇంకా విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. బరువు తగ్గడానికి మొక్కజొన్న చాలా మంచిది.

మొక్కజొన్నలో విటమిన్ బీ6 అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్, గ్లూటెన్‌లు మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్, అనీమియా, గుండె వ్యాధులు లాంటివి రాకుండా నిరోధిస్తుంది. దీనిలో ఉండే కెరోటినాయిడ్స్, ఫోలిక్ యాసిడ్ లాంటివి వ్యాధులతో పోరాడటంలో సహకరిస్తాయి.

ఆరోగ్యకరమైన కళ్ళు, జుట్టు, చర్మానికి ఐరన్ మొక్కజొన్న అవసరం. మొక్కజొన్నలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మొక్కజొన్న తినడం వల్ల కళ్లు, చర్మానికి రక్షణగా ఉంటుంది. పిల్లల ఎదుగుదలకు, బరువు పెరగడానికి కూడా సహకరిస్తుంది.

వంద గ్రాముల ఉడకబెట్టిన మొక్కజొన్న గింజల్ని తీసుకోవడం వల్ల మనకు 88 క్యాలరీలు, 19 గ్రాముల కార్బో హైడ్రేట్‌లు, 9.4 గ్రాముల ప్రొటీన్, 1.4 గ్రాముల కొవ్వు లభిస్తాయి. విటమిన్ ఏ, విటమిన్ ఈ, థయామిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, విటమిన్ బీ6, ఫోలేట్, పేంతోనేనిక్ యాసిడ్, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, జింక్, మాంగనీస్, కాపర్, సెలీనియంలు లభిస్తాయి.

మొక్కజొన్న లుటిన్, జియాక్సంతిన్‌తో సహా యాంటీఆక్సిడెంట్‌లతో నిండి ఉంటుంది. ఇవి కళ్లను రక్షించడంలో సహాయపడతాయి. కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు.. గుండె జబ్బులకు కూడా చాలా మంచిది. రక్తహీనతను నివారించడానికి మొక్కజొన్న ఉత్తమమైన ఆహారం.




