- Telugu News Photo Gallery Cinema photos Rajamouli's tweet about made in India got viral in social media
Rajamouli: రాజమౌళి కొత్త ప్రాజెక్ట్ షురూ.. ‘మేడ్ ఇన్ ఇండియా’పై కీలక అప్డేట్ ఇచ్చిన జక్కన్న..
ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి ఏడాదిన్నర అవుతోంది. నెక్స్ట్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇప్పటికైతే క్లారిటీ లేదు. మరి అన్ని రోజులూ వార్తల్లో ఉండాలంటే ఎలా? అలాగని జస్ట్ వార్తల్లో ఉండే పనులే చేసే రకం కాదు జక్కన్న. ఆయన చేసే పనులే ఆయన్ని వార్తల్లో ఉంచుతున్నాయి. రాజమౌళి ప్రెజెంట్స్ అంటూ స్టార్ట్ అయిన ఓ ప్రాజెక్టు గురించి ఇప్పుడు నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా... ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేస్తూ, రాజమౌళి పెట్టిన ట్వీట్‌కి ఫిదా అవుతున్నారు సినీ జనాలు. తాను ఇప్పటిదాకా ఎప్పుడూ అంత ఎమోషనల్ కాలేదని చెప్పారు.
Updated on: Sep 20, 2023 | 5:54 PM

ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి ఏడాదిన్నర అవుతోంది. నెక్స్ట్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇప్పటికైతే క్లారిటీ లేదు. మరి అన్ని రోజులూ వార్తల్లో ఉండాలంటే ఎలా? అలాగని జస్ట్ వార్తల్లో ఉండే పనులే చేసే రకం కాదు జక్కన్న. ఆయన చేసే పనులే ఆయన్ని వార్తల్లో ఉంచుతున్నాయి. రాజమౌళి ప్రెజెంట్స్ అంటూ స్టార్ట్ అయిన ఓ ప్రాజెక్టు గురించి ఇప్పుడు నెట్టింట వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

మేడ్ ఇన్ ఇండియా... ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేస్తూ, రాజమౌళి పెట్టిన ట్వీట్‌కి ఫిదా అవుతున్నారు సినీ జనాలు. తాను ఇప్పటిదాకా ఎప్పుడూ అంత ఎమోషనల్ కాలేదని చెప్పారు. బయోపిక్ చేయడమే కష్టం అనుకుంటే, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా గురించి చెప్పడం మరింత చాలెంజింగ్ అని అన్నారు.

మేడ్ ఇన్ ఇండియాకు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన తనయుడు కార్తికేయ నిర్మాతల్లో ఒకరు. రాజమౌళి చేసిన బాహుబలికి, ఆ తర్వాత ట్రిపుల్ ఆర్‌కి కూడా సెకండ్ యూనిట్ డైరక్టర్‌గా పనిచేశారు కార్తికేయ. ఇప్పుడు అదే ఎక్స్ పీరియన్స్ తో నెవర్ బిఫోర్ మూవీ మేడ్ ఇన్ ఇండియాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ట్రిపుల్ ఆర్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కి ఇంకా మూవ్ కాలేదు రాజమౌళి. ఆల్రెడీ మహేష్ ఇప్పుడు త్రివిక్రమ్ గుంటూరు కారంతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాను పూర్తి చేసుకున్నాకే జక్కన్న సెట్స్ కి వస్తారు ఘట్టమనేని హీరో. ఒన్స్ ఆ సినిమా విడుదలైతే ఎలాగూ బిజీ బిజీగా ఉంటారు కాబట్టి, ఉన్న టైమ్‌ని ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు జక్కన్న.

మరోవైపు అదర్ ఇంట్రస్టుల కోసం కూడా టైమ్ స్పెండ్ చేస్తున్నారు రాజమౌళి. ఆల్రెడీ ఓ యాడ్ ఫిల్మ్ చేసిన ఈ హీరో, నెక్స్ట్ కల్కి సినిమాలోనూ గెస్ట్ రోల్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఓ వైపు డైరక్టర్‌గా తన పని మీద ఫోకస్ చేస్తూనే, మిగిలిన సమయాన్ని ఫ్రూట్‌ఫుల్‌గా వాడుకుంటున్నారు జక్కన్న.




