Gunturkaram: మాట తప్పం.. మడమ తిప్పం.. చెప్పిన టైంకి వస్తున్నాం.. ఢీ కొడుతున్నాం..
మాటంటే మాటే. మాటిస్తే మడిమ వెనక్కి తిప్పేదేలేదు అని అంటున్నారు మహేష్ బాబు. పావు గంటా, అరగంటా కాదు, గంటలకొద్దీ చేయమన్నా చేయడానికి నేను రెడీగా ఉన్నా. చెప్పిన టైమ్‌కి ప్రాజెక్ట్ థియేటర్లలో ల్యాండ్ కావాలనే కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నారు సూపర్‌స్టార్. సర్కారువారి పాటను ఘట్టమనేని అభిమానులు మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు. మహేష్ కెరీర్‌లో ఔట్ ఆఫ్ ద బాక్స్ వెళ్లి మరీ చేసిన సినిమా అది. దాన్ని మించిపోయే సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు సూపర్‌స్టార్ సైన్యం. ప్రస్తుతానికి కమాన్ కమాన్ కళావతి అంటూ పాటలు పాడుకుంటున్నారు.