AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: ఈ ముగ్గురు చాలా డేంజర్ గురూ.. వన్డే సిరీస్‌లో టీమిండియాపై ‘విలన్‌’ పాత్రకు రెడీ.. లిస్టులో ఎవరున్నారంటే?

ఆసియా కప్ 2023 గెలిచిన తర్వాత భారత జట్టులో ఉత్సాహం పెరిగింది. అయితే, ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడం అవివేకమే అవుతుంది. ఆస్ట్రేలియా జట్టులో ముగ్గురు ప్రమాదకరమైన ఆటగాళ్ళు ఉన్నారు. వారు ఏ జట్టుకైనా చుక్కలు చూపించగలరు. ఆ ఆటగాళ్లలో ఎవరైనా తమ పాత ఫీట్‌ను పునరావృతం చేస్తే కోట్లాది మంది టీమిండియా ఫ్యాన్స్ నిరాశ చెందాల్సి ఉంటుంది.

Venkata Chari
|

Updated on: Sep 20, 2023 | 7:17 PM

Share
Australian Playing XI vs India ODI Series: మూడు మ్యాచ్‌ల భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ మొహాలీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. వచ్చే నెలలో భారత్‌ ఆతిథ్యమివ్వనున్న ప్రపంచకప్‌నకు ముందు ఇది కీలక సిరీస్‌గా మారింది. ఈ సిరీస్‌లో ఏ జట్టు గెలుపొందినా ప్రపంచకప్‌లో నూతనోత్సాహంతో బరిలోకి దిగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

1 / 5
ఆసియా కప్ 2023 గెలిచిన తర్వాత భారత జట్టులో ఉత్సాహం పెరిగింది. అయితే, ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడం అవివేకమే అవుతుంది. ఆస్ట్రేలియా జట్టులో ముగ్గురు ప్రమాదకరమైన ఆటగాళ్ళు ఉన్నారు. వారు ఏ జట్టుకైనా చుక్కలు చూపించగలరు. ఆ ఆటగాళ్లలో ఎవరైనా తమ పాత ఫీట్‌ను పునరావృతం చేస్తే కోట్లాది మంది టీమిండియా ఫ్యాన్స్ నిరాశ చెందాల్సి ఉంటుంది.

ఆసియా కప్ 2023 గెలిచిన తర్వాత భారత జట్టులో ఉత్సాహం పెరిగింది. అయితే, ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయడం అవివేకమే అవుతుంది. ఆస్ట్రేలియా జట్టులో ముగ్గురు ప్రమాదకరమైన ఆటగాళ్ళు ఉన్నారు. వారు ఏ జట్టుకైనా చుక్కలు చూపించగలరు. ఆ ఆటగాళ్లలో ఎవరైనా తమ పాత ఫీట్‌ను పునరావృతం చేస్తే కోట్లాది మంది టీమిండియా ఫ్యాన్స్ నిరాశ చెందాల్సి ఉంటుంది.

2 / 5
1. గ్లెన్ మాక్స్‌వెల్: ఆస్ట్రేలియా డేంజరస్ బ్యాట్స్‌మన్ (IND vs AUS 2023 ODI Series) గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ కంగారూ బ్యాట్స్‌మెన్ ఎలాంటి బౌలర్లనైనా చితక్కొట్టగలడని క్రికెట్ చూసే వారికి తెలుసు. భారత్‌పై మ్యాక్స్‌వెల్ బ్యాట్ కూడా బాగా పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత బౌలర్లకు మరోసారి ఇబ్బందులు తలెత్తవచ్చు.

3 / 5
2. మిచెల్ మార్ష్: ప్రస్తుతం ఆస్ట్రేలియా అత్యుత్తమ ఆల్ రౌండర్లలో మిచెల్ మార్ష్ ఒకరు. మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పగల సత్తా మార్ష్‌కు ఉంది. అతను భారత్‌పై చాలాసార్లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాదు, బౌలింగ్‌లో కూడా బ్యాట్స్‌మెన్‌ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టగలడు. మార్ష్‌ను తేలికగా అంచనా వేయడాన్ని భారత ఆటగాళ్లు తప్పుపట్టలేరన్నది సుస్పష్టం.

4 / 5
3. కామెరాన్ గ్రీన్: ఈ యువ ఆల్ రౌండర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గ్రీన్ తన వయసుకు మించిన ఆటతో రెచ్చిపోతున్నాడు. ఈ యువ ఆటగాడికి భారత పరిస్థితులలో కూడా చాలా అనుభవం ఉంది. అతను IPL 2023లో ముంబై ఇండియన్స్ జట్టులో భాగమయ్యాడు. ఒక మ్యాచ్‌లో తన మొదటి IPL సెంచరీని సాధించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ గ్రీన్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. అవసరమైన సమయంలో వికెట్లు తీయడం అతని ప్రత్యేకత. గ్రీన్ కూడా టీమ్ ఇండియాకు పెద్ద సవాల్‌గా నిలుస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

5 / 5