Walnuts’ Benefits: వాల్ నట్స్ ను ఎలా తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి!
చాలా మందికి వాల్ నట్స్ గురించి తెలుసు. వీటినే అక్రోట్లు అని కూడా అంటూంటారు. క్రమం తప్పకుండా వీటిని తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం అవుతాయి. వాల్ నట్స్ తింటే శరీంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పిల్లలకు కూడా వీటిని ఇవ్వొచ్చు. చిన్న పిల్లలకు డ్రై ఫ్రూట్స్ ను కొంత మోతాదులో అందిస్తే వారు కూడా బలంగా, ఆరోగ్య వంతంగా తయారవుతారు. ప్రస్తుతం ఇప్పుడు అందరూ విరివిగా డ్రై ఫ్రూట్స్ ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వాల్ నట్స్ లో..
చాలా మందికి వాల్ నట్స్ గురించి తెలుసు. వీటినే అక్రోట్లు అని కూడా అంటూంటారు. క్రమం తప్పకుండా వీటిని తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతం అవుతాయి. వాల్ నట్స్ తింటే శరీంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. పిల్లలకు కూడా వీటిని ఇవ్వొచ్చు. చిన్న పిల్లలకు డ్రై ఫ్రూట్స్ ను కొంత మోతాదులో అందిస్తే వారు కూడా బలంగా, ఆరోగ్య వంతంగా తయారవుతారు. ప్రస్తుతం ఇప్పుడు అందరూ విరివిగా డ్రై ఫ్రూట్స్ ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వాల్ నట్స్ లో సెలీనియం, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం,మెగ్నీషియం, ప్రొటీన్, ఆరోగ్యకరైమన కొవ్వులు, విటమిన్లు, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్, ఖనిజాలు అన్నీ పుష్కలంగా లభిస్తాయి. వీటిని డ్రై ఫ్రూట్స్ లో రారాజు అని పిలుస్తారంటే అర్థం చేసుకోవచ్చు. వాల్ నట్స్ ను తింటే మెదడు చురుకుగా పని చేయడమే కాకుండా.. జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది.
అయితే వాటిని ఏ విధంగా వాడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనేది తెలీదు. అలాగే ఎంత క్వాంటిటీ తీసుకోవాలో కూడా తెలీదు. ఈ వాల్ నట్స్ ధర కాస్త ఎక్కువ అయినా కూడా.. వీటితో కలిగే లాభాలు మాత్రం చాలా ఎక్కువ. ఈ అక్రోట్లను బాదంను ఎలా నానబెట్టి తీసుకుంటామో.. వీటిని కూడా అలాగే రాత్రంతా నీటిలో నాన బెట్టి తీసుకోవాలి. టేస్ట్ కాస్త ఏదోలా ఉన్నా.. ఇవి ఆరోగ్యానికి మాత్రం చాలా మంచి చేస్తుంది. వీటిని నానబెట్టి తింటేనే శరీరానికి పోషకాలు అందడంతో పాటు తేలికగా జీర్ణం అవుతాయి. రోజుకు రెండు మూడు వాల్ నట్స్ పీసెస్ ను తీసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా వీటిని తింటే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను కంట్రోల్ లోకి తీసుకు రావచ్చు. అలాగే సీజనల్ వ్యాధులైన జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటితో కూడా పోరాడే ఇమ్యూనిటీ లభిస్తుంది.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది:
వాల్ నట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. అక్రోట్లలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాకుండా.. గుడ్ కొలెస్ట్రాల్ ఏర్పడేందుకు సహాయం చేస్తుంది. అంతేకాకుండా రక్త పోటు సమస్యను తగ్గిస్తుంది.
ఎముకలు గట్టిగా బలంగా తయారు అవుతాయి:
వాల్ నట్స్ లో క్యాల్షియం, ఐరన్ ఎముకలు గట్టిగా ఉండేందుకు సహాయం చేస్తాయి. అలాగే వీటిల్లో ఉండే ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్.. ఎముకల బలోపేతం చేయడానికి హెల్ప్ చేస్తుంది.
బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తాయి:
అక్రోట్లలో పీచు పదార్థం, ఫైబర్ ఉంది కాబట్టి.. ఇవి తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసేందుకు హెల్ప్ చేస్తాయి. దీంతో తిన్న ఆహారం నిల్వ లేకుండా ఉంటుంది. వీటితో మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడమే కాకుండా ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంతో బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
క్యాన్సర్ ను తినడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను నశించేలా చేస్తుంది. రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి పలు రకాల క్యాన్సర్ ల నుంచి రక్షించడంలో అక్రోట్లు బాగా ఉపయోగ పడతాయని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
గర్భీణీలకు మంచిది:
గర్భినీలు హాయిగా ఈ వాల్ నట్స్ ను తినవచ్చు. ఇందులో ఉండే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు వారిలో బిడ్డ ఎదుగుదలకు బాగా సహాయ పడతాయి.
మధుమేహ రోగులకు బెస్ట్ ఫుడ్:
షుగర్ ను తగ్గించడంలో వాల్ నట్స్ కీలక పాత్ర వహిస్తాయి. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో టైప్-2 డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.