Bread Uttapam: బ్రెడ్ తో ఊతప్పం ఇలా చేయండి.. కేవలం 5 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ!
బ్రెడ్ తో మనం ఎన్నో రకాల రెసిపీలు తయారు చేస్తూ ఉంటాం. బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్, సలాడ్స్, బ్రెడ్ బాల్స్ ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసే వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో ఏవైనా ఫాస్ట్ గా అయిపోతాయి. అలాగే ఇప్పడు మరో కొత్త రెసిపీ బ్రెడ్ ఊతప్పం తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో ఊతప్పం నా ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? చాలా ఈజీ అండ్ కేవలం ఐదే నిమిషాలతో తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇడ్లీ పిండితో ఎప్పడూ ఊతప్పం తిని బోర్ కొట్టే వాళ్లు.. ఇలా వెరైటీగా చేసుకోవచ్చు. వీటిని కూడా ఇడ్లీ పిండి, దోశ పిండితో చేసుకోవచ్చు. మరి వీటికి కావాల్సిన..
బ్రెడ్ తో మనం ఎన్నో రకాల రెసిపీలు తయారు చేస్తూ ఉంటాం. బ్రేక్ ఫాస్ట్, స్నాక్స్, సలాడ్స్, బ్రెడ్ బాల్స్ ఇలా చాలా రకాలు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసే వంటలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో ఏవైనా ఫాస్ట్ గా అయిపోతాయి. అలాగే ఇప్పడు మరో కొత్త రెసిపీ బ్రెడ్ ఊతప్పం తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో ఊతప్పం నా ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? చాలా ఈజీ అండ్ కేవలం ఐదే నిమిషాలతో తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇడ్లీ పిండితో ఎప్పడూ ఊతప్పం తిని బోర్ కొట్టే వాళ్లు.. ఇలా వెరైటీగా చేసుకోవచ్చు. వీటిని కూడా ఇడ్లీ పిండి, దోశ పిండితో చేసుకోవచ్చు. మరి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
దోశ పిండి లేదా ఇడ్లీ పిండి, బ్రౌన్ బ్రెడ్, శనగ పిండి, చిన్న తరిగిన ఉల్లి పాయ, పచ్చిమిర్చి, కొత్తి మీర, కరివేపాకు, అల్లం తరుగు, ఉప్పు, క్యారెట్ తురుము, నూనె
బ్రెడ్ ఊతప్పం తయారీ విధానం:
బ్రెడ్ ను ముందుగా నీటిలో ముంచి తీసి.. లోతుగా ఉండే గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోకి నూనె తప్పించి మిగిలిన అన్ని పదార్థాలు వేసుకోవచ్చు. బ్రెడ్ బాగా కలిసి పోయేలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఈ లోపు స్టవ్ మీద పెనం ఉంచి వేడి చేసుకోవాలి. ఇలా తయారైన బ్యాటర్ ని వేడిగా ఉన్న పెనం మీద పల్చగా.. దోశ ఊతప్పంలా వేసుకోవాలి. నెక్ట్స్ దీన్ని నూనె వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఊతప్పం రెడీ. దీన్ని అల్లం చట్నీ లేదా రోటి పచ్చడితో చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఇలా ఓ సారి ట్రై చేయండి. ఒకే టిఫిన్ తిని బోర్ కొట్టే వాళ్లు.. ఇలా వెరైటీగా చేసుకోవచ్చు. ఫాస్ట్ గా కూడా అయిపోతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి