AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tasty Snack Noodles Samosa: ‘నూడుల్స్ సమోసా’ దీని టేస్ట్ గురించి మాటలు ఉండవు.. ఓన్లీ తినడమే!

ఎన్నో రకాల సమోసాలను తిని, వినే ఉంటారు. వెజ్, నాన్ వెజ్ ఇలా చాలా రకాలు ఉంటాయి. పన్నీర్ సమోసా, ఆలూ సమోసా, స్వీట్ కార్న్ సమోసా, వెజిటేబుల్ సమోసా, ఉల్లిపాయ సమోసా, చికెన్ సమోసా, మటన్ సమోసా.. చెబుతుంటూనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదూ. సమోసాల్లో అన్ని రకాలు ఉంటాయి మరి. వాటిల్లో ఎలాంటి ఫిల్లింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదే మాదిరిగా నూడుల్స్ సమోసా కూడా చేసుకోవచ్చు. అదేంటి నూడుల్స్ తో సమోసానా అని ఆశ్చర్య పోతున్నారా? నూడుల్స్ ని, సమోసాని ఎప్పుడూ కలిపి తినలేదు కదా. ఈ సారి ఇలా చేయండి టేస్ట్ అదిరిపోతుంది. క్రీస్పీగా, క్రంచీగా, సాఫ్ట్ గా..

Tasty Snack Noodles Samosa: 'నూడుల్స్ సమోసా' దీని టేస్ట్ గురించి మాటలు ఉండవు.. ఓన్లీ తినడమే!
noodles samosa
Chinni Enni
| Edited By: |

Updated on: Sep 17, 2023 | 12:00 PM

Share

ఎన్నో రకాల సమోసాలను తిని, వినే ఉంటారు. వెజ్, నాన్ వెజ్ ఇలా చాలా రకాలు ఉంటాయి. పన్నీర్ సమోసా, ఆలూ సమోసా, స్వీట్ కార్న్ సమోసా, వెజిటేబుల్ సమోసా, ఉల్లిపాయ సమోసా, చికెన్ సమోసా, మటన్ సమోసా.. చెబుతుంటూనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదూ. సమోసాల్లో అన్ని రకాలు ఉంటాయి మరి. వాటిల్లో ఎలాంటి ఫిల్లింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదే మాదిరిగా నూడుల్స్ సమోసా కూడా చేసుకోవచ్చు. అదేంటి నూడుల్స్ తో సమోసానా అని ఆశ్చర్య పోతున్నారా? నూడుల్స్ ని, సమోసాని ఎప్పుడూ కలిపి తినలేదు కదా. ఈ సారి ఇలా చేయండి టేస్ట్ అదిరిపోతుంది. క్రీస్పీగా, క్రంచీగా, సాఫ్ట్ గా బలే ఉంటాయి. పిల్లలే కాదు పెద్దలు కూడా మళ్లీ మళ్లీ చేయమని అడుగుతూంటారు. మరి దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక సారి చూసేద్దాం.

నూడుల్స్ సమోసాకి కావాల్సిన పదార్థాలు:

నూడుల్స్, మైదా పిండి, క్యాబేటీ, క్యాప్సికం, క్యారెట్ తురుపు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, కారం, వాము, నెయ్యి, కారం, నల్ల మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి, పంచదార, నూనె.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నె తీసుకుని మీకు కావాల్సినన్ని క్వాంటిటీకి తగిన విధంగా మైదా పిండి, నెయ్యి, ఉప్పు, వాము తీసుకుని పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు వేరే గిన్నె తీసుకుని.. అందులో నీళ్లు పోసి బాగా వేడి చేయాలి. అందులో నూడుల్స్ ని 90 శాతం వరకూ ఉడికించుకోవాలి. ఇలా నూడుల్స్ ఉడుకుతున్నప్పుడు నాలుగు, ఐదు నూనె చుక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత నీటిని ఉడకపెట్టి.. ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత మరో కడాయిలో నూనె వేడి చేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికం, క్యాబేజీ, క్యారెట్ తరుగు వేసి.. పచ్చి వాసన పోయేంత వరకూ బాగా వేయించుకోవాలి. ఆ నెక్ట్స్ ఉప్పు, కారం, రెండు రకాల మిరియాల పొడులు, పంచదార వేసుకోవాలి. తర్వాత చల్లారిపోయిన నూడుల్స్ ని కూడా వేసి బాగా కలుపుకుని.. స్టవ్ ఆఫ్ చేసి చల్లార నివ్వాలి.

ఈ లోపు మరో కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న మైదా పిండిని ఉండలుగా చేసుకుని, చపాతీలాగా వత్తుకుని సమోసా షేప్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నూడుల్స్ ని ఫిల్ చేసి.. పిండి అంచులను మూసి వేయాలి. ఇలా అన్నింటినీ తయారు చేసుకున్న తర్వాత వేడెక్కిన నూనెలో వేసుకుని, మంటను మీడియంలో ఉంచి ఎర్రగా అయ్యేంత వరకూ కాల్చుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే నూడుల్స్ సమోసాలు రెడీ. ఈ రెసిపీ చేయడానికి కాస్త సమయం పట్టినా.. టేస్ట్ గురించి మాత్రం చెప్పాల్సిన పని లేదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us