Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dandruff Tips: దీంతో చుండ్రు సమస్యనే కాదు.. జుట్టు కూడా పెరుగుతుంది!

చాలా మంది ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ లో చుండ్రు సమస్య కూడా ఒకటి. ఈ చుండ్రు కారణంగా ముఖం కూడా పాడవుతుంది. ఫేస్ పై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. చుండ్రు కారణంగా తలపై దురద వస్తూ, జుట్టు ఆయిలీగా ఉంటూ ఉంటుంది. భుజంపై కూడా చుండ్రు పడటం.. తల దువ్వినప్పుడల్లా చుండ్రు రాలుతూ ఉంటుంది. దీంతో చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా చాలా సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది. జుట్టును సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల ఈ చుండ్రు ఏర్పడుతుంది. స్కాల్ఫ్ మీద డెడ్ స్కిన్ సెల్స్ బాగా పేరుకుపోతాయి. సరిగ్గా తల స్నానం చేయకపోతే అది అలానే..

Dandruff Tips: దీంతో చుండ్రు సమస్యనే కాదు.. జుట్టు కూడా పెరుగుతుంది!
చలికాలంలో చుండ్రు అంత తేలికగా వదలదు. దానితో స్కాల్ప్ దురద పెరుగుతుంది. వెంట్రుకలు, శిరోజాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. చుండ్రు సమస్యను నివారించాలంటే ఈ చిట్కాలు పాటించండి
Follow us
Chinni Enni

|

Updated on: Sep 11, 2023 | 3:24 PM

చాలా మంది ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ లో చుండ్రు సమస్య కూడా ఒకటి. ఈ చుండ్రు కారణంగా ముఖం కూడా పాడవుతుంది. ఫేస్ పై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. చుండ్రు కారణంగా తలపై దురద వస్తూ, జుట్టు ఆయిలీగా ఉంటూ ఉంటుంది. భుజంపై కూడా చుండ్రు పడటం.. తల దువ్వినప్పుడల్లా చుండ్రు రాలుతూ ఉంటుంది. దీంతో చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా చాలా సమస్యలు ఎదుర్కొన వలసి వస్తుంది. జుట్టును సరిగ్గా పట్టించుకోక పోవడం వల్ల ఈ చుండ్రు ఏర్పడుతుంది. స్కాల్ఫ్ మీద డెడ్ స్కిన్ సెల్స్ బాగా పేరుకుపోతాయి. సరిగ్గా తల స్నానం చేయకపోతే అది అలానే ఉండిపోయి.. చుండ్రు ఏర్పడుతుంది. ఈ చుండ్రు అంత త్వరగా పోదు. దీన్ని దూరం చేసుకోవడానికి అనేక రకాల టిప్స్ పాటించినా ప్రయోజనం ఉండదు. ఇలా చుండ్రు సమస్యలతో బాధ పడేవారికి ఈ ప్యాక్ బాగా హెల్ప్ చేస్తుంది. ఇలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హెయిర్ ప్యాక్ తయారీ విధానం:

ముందుగా ఓ గుప్పెడు మెంతులను రాత్రంతగా నీటిలో నాన బెట్టాలి. ఇలా నానిన ఈ మెంతుల్లో ఆలివ్ ఆయిల్, పెరుగు వేసి మెత్తని పేస్ట్ గా మిక్సీ పట్టాలి. ఈ పేస్ట్ ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. ఆరిపోయాక గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది. ఈ ప్యాక్ తో చుండ్రు సమస్యనే కాకుండా.. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. కాగా చుండ్రు సమస్య రాకుండా ఉండాలంటే కనీసం వారంలో రెండు సార్లైనా తల స్నానం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే స్కాల్ఫ్ పై ఉన్న డెడ్ స్కీన్ సెల్స్ పోతాయి.

ఇవి కూడా చదవండి

ఈ ప్యాక్ ప్రయోజనాలు:

– చుండ్రును తగ్గించడంలో మెంతులు, పెరుగు బాగా పని చేస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. – ఆలివ్ ఆయిల్ జుట్టు పెరిగేలా చేస్తుంది. హెయిర్ కి మాయిశ్చరైజ్ ను అందిస్తుంది. – ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టు బాగా మెరుస్తుంది. – దురద, ఎలర్జీస్ ఏమైనా ఉంటే పోతాయి. – జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. – స్కాల్ఫ్ పై ఉన్న జిడ్డు పోతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి