Poha Vada: గెస్టులు వచ్చారా.. పది నిమిషాల్లో స్నాక్స్ చేయాలా? అయితే ఇవి చేయండి!!

అప్పుడప్పుడు సడన్ గా ఇంటికి గెస్టులు వస్తూంటారు. ఏం చేయాలో తెలీదు.. ఎక్కువ సమయం కూడా పట్టకూడదు. అయితే ఈ సారి ఇలా ట్రై చేయండి. ఈజీగా, క్రిస్పీగా, సాఫ్ట్ అయిన వడలు తయారు అయిపోతాయి. వడలా చాలా టైం పడుతుంది కదా అనుకునేరు. ఇవి అటుకులతో తయారు చేసేవి. చాలా తక్కువ టైమ్ పడుతుంది. నూనె వేడెక్కడమే లేట్ అంతే. అటుకులతో చేసేవి ఏమైనా టేస్టీగా, ఫాస్ట్ గా అయిపోతాయి. ఇప్పుడు ఈ వడలు కూడా అంతే. కేవలం 15 నిమిషాల్లోనే అయిపోతాయి. మరి ఈ వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు..

Poha Vada: గెస్టులు వచ్చారా.. పది నిమిషాల్లో స్నాక్స్ చేయాలా? అయితే ఇవి చేయండి!!
Poha Vada
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 17, 2023 | 10:00 AM

అప్పుడప్పుడు సడన్ గా ఇంటికి గెస్టులు వస్తూంటారు. ఏం చేయాలో తెలీదు.. ఎక్కువ సమయం కూడా పట్టకూడదు. అయితే ఈ సారి ఇలా ట్రై చేయండి. ఈజీగా, క్రిస్పీగా, సాఫ్ట్ అయిన వడలు తయారు అయిపోతాయి. వడలా చాలా టైం పడుతుంది కదా అనుకునేరు. ఇవి అటుకులతో తయారు చేసేవి. చాలా తక్కువ టైమ్ పడుతుంది. నూనె వేడెక్కడమే లేట్ అంతే. అటుకులతో చేసేవి ఏమైనా టేస్టీగా, ఫాస్ట్ గా అయిపోతాయి. ఇప్పుడు ఈ వడలు కూడా అంతే. కేవలం 15 నిమిషాల్లోనే అయిపోతాయి. మరి ఈ వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

అటుకుల వడలకు కావాల్సిన పదార్థాలు:

అటుకులు, శనగ పిండి, బియ్యం పిండి, ఉల్లి పాయ, పచ్చి మిరపకాయలు, అల్లం తరుగు, కరివేపాకు, ఉప్పు, కారం, కొత్తి మీర, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, నూనె

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ముందుగా ఓ గిన్నెలోని అటుకులు తీసుకుని దాని నిండా నీళ్లు పోసుకోవాలి. ఇవి ఓ పది నిమిషాల పాటు నాన బెట్టాలి. ఆ తర్వాత వాటిని చేతితో నీరు పోయేంత వరకూ పిండి.. లోతైన గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో బియ్యం పిండి, శనగ పిండి, కొద్దిగా నీరు, ఇలా నూనె తప్ప మిగిలిన అన్ని పదార్థాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ లోపు ఓ కడాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. నెక్ట్స్ కొద్దిగా పిండి తీసుకుని వడల్లాగా ఒత్తుకోవాలి. నూనె వేడెయ్యాక.. పక్కన పెట్టుకున్న వడలను నూనెలో వేసి వేయించుకోవాలి. తొందరగా మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి.. మీడియం మంటలో పెట్టుకోవాలి. వీటిని రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ అటుకుల వడలు సిద్ధం. వీటిని టమాటా కిచప్ తో అయినా, నార్మల్ చట్నీతో అయినా, లేక ఉత్తివి అయినా తినొచ్చు. ఇలా అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పోహా వడలు తయారు చేసుకుని తినవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు