AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Walking Benefits: వాకింగ్ చేస్తున్నారా.. అయితే రోజుకు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా?

ప్రతి రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వాకింగ్ వల్ల చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గడంతో పాటు, గుండె సమస్యలు, బీపీ, కొలెస్ట్రాల్ వంటి వాటికి దూరంగా ఉండవచ్చు. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగు పడుతుంది. చాలా ఈజీగా చేసే వ్యాయామాల్లో వాకింగ్ కూడా ఒకటి. ఏ వయసు వారైనా.. ఎలాంటి పేషెంట్లు అయినా రోజూ ఉదయం వాకింగ్ చేయవచ్చు. వాకింగ్ చేస్తారు కానీ.. ఎంత చేయాలి? ఎంత వరకూ నడిస్తే మనకు హెల్ప్ అవుతుందోనన్న విషయం చాలా మందికి తెలీదు. కొంత మంది పార్క్ చుట్టూ రౌండ్లు కొడతారు. మరికొంత మంది గంట లేదా రెండు గంటల పాటు..

Walking Benefits: వాకింగ్ చేస్తున్నారా.. అయితే రోజుకు ఎన్ని అడుగులు నడవాలో తెలుసా?
Walking
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 17, 2023 | 10:30 AM

Share

ప్రతి రోజూ వాకింగ్ చేయడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వాకింగ్ వల్ల చాలా అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బరువు తగ్గడంతో పాటు, గుండె సమస్యలు, బీపీ, కొలెస్ట్రాల్ వంటి వాటికి దూరంగా ఉండవచ్చు. అలాగే జీర్ణ వ్యవస్థ కూడా మెరుగు పడుతుంది. చాలా ఈజీగా చేసే వ్యాయామాల్లో వాకింగ్ కూడా ఒకటి. ఏ వయసు వారైనా.. ఎలాంటి పేషెంట్లు అయినా రోజూ ఉదయం వాకింగ్ చేయవచ్చు.

వాకింగ్ చేస్తారు కానీ.. ఎంత చేయాలి? ఎంత వరకూ నడిస్తే మనకు హెల్ప్ అవుతుందోనన్న విషయం చాలా మందికి తెలీదు. కొంత మంది పార్క్ చుట్టూ రౌండ్లు కొడతారు. మరికొంత మంది గంట లేదా రెండు గంటల పాటు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా మీ శక్తిని అనవసరంగా కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 7 వేల అడుగులు నడిస్తే సరి పోతుందని అంటున్నారు. అయితే 7000 అడుగులు లెక్కించడం కష్టం. ఏదో ఆడుతూ పాడుతూ.. సరదాగా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ వెళ్తారు. కానీ ఇలా అడుగులు లెక్క పెట్టుకుంటూ వెళ్లాలంటే ఎవరికైనా కష్టమే.

కాబట్టి మీ స్మార్ట్ ఫోను ఉపయోగించుకోండి. మీ ఫోన్ లో పెడోమీటర్ యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే సరి పోతుంది. తర్వాత మీరు వాకింగ్ చేసేటప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. కాసేపు ఆగాక చూస్తే మీరు ఎన్ని అడుగులు నడిచారో చూపిస్తుంది. సో దాన్ని బట్టి ఎంత సేపు నడిస్తే.. ఎక్కడి వరకు నడిస్తే సరిపోతుందో చూసుకోవాలి. ఇలా ఈజీగా చేసుకుంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది. మీ ఆరోగ్య పరిస్థితి, మీ స్టామినా బట్టి అడుగులు తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్రతి రోజూ వాకింగ్ తో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

– శరీర భాగాల్లో ఉన్న అధిక కొవ్వును కరిగించుకోవడంతో పాటు కండరాలు, ఎముకలు బలంగా, ఫిట్ గా తయారవుతాయి. – అంతే కాకుండా రోజంతా యాక్టీవ్ గా ఉంటాం. – బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. – చర్మం ఫ్రెష్ గా, గ్లోగా తయారవుతుంది. – గుండెకు సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. – నిద్రలేమి కూడా ఉండదు. – మెదడు చురుకుగా పని చేస్తుంది. – షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ లోకి వస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి