Bhadrasana Benefits: ఈ ఆసనం వేస్తే పురుషులకు అమేజింగ్ బెనిఫిట్స్.. దెబ్బకు వాటన్నింటికి చెక్ పెట్టవచ్చు!

సాధారణంగా ఆడవాళ్ల కంటే పురుషులు మరింత బలంగా ఉండాలి. వాళ్లు అవసరమయ్యే శక్తి కూడా ఎక్కువ కావాలి. ఇంట్లోని టెన్షన్స్, బయట ఆఫీసులో చికాకులు ఇలా పురుషుల చుట్టూ అనేక విషయాలు తిరుగుతూ ఉండాలి. దీంతో వాళ్లకు కూడా రిఫ్రెష్ మెంట్ కావాల్సి ఉంటుంది. ఇలాంటి పురుషులకు యోగా ఆసనాలు బాగా పని చేస్తాయి. యోగా ఆసనాల్లో స్త్రీలకు, పురుషులకు కూడా వేర్వేరు ఉంటాయి. వాటిని చేయడం వల్ల భిన్న ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే..

Bhadrasana Benefits: ఈ ఆసనం వేస్తే పురుషులకు అమేజింగ్ బెనిఫిట్స్.. దెబ్బకు వాటన్నింటికి చెక్ పెట్టవచ్చు!
Yoga
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 17, 2023 | 11:00 AM

సాధారణంగా ఆడవాళ్ల కంటే పురుషులు మరింత బలంగా ఉండాలి. వాళ్లు అవసరమయ్యే శక్తి కూడా ఎక్కువ కావాలి. ఇంట్లోని టెన్షన్స్, బయట ఆఫీసులో చికాకులు ఇలా పురుషుల చుట్టూ అనేక విషయాలు తిరుగుతూ ఉండాలి. దీంతో వాళ్లకు కూడా రిఫ్రెష్ మెంట్ కావాల్సి ఉంటుంది. ఇలాంటి పురుషులకు యోగా ఆసనాలు బాగా పని చేస్తాయి. యోగా ఆసనాల్లో స్త్రీలకు, పురుషులకు కూడా వేర్వేరు ఉంటాయి. వాటిని చేయడం వల్ల భిన్న ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆసనం.. పురుషులకు ఎంతగానో ఉపయోగ పడతాయి. మరి ఆ ఆసనం ఏంటి? దాన్ని ఎలా వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పురుషులకు ఎన్నో బెనిఫిట్స్:

గోరక్షాసనం లేదా భద్రాసనంతో పురుషులకు అనేక బెనిఫిట్స్ ఉంటాయి. పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరుగుతుంది. మడమలు, మోకాళ్ల నొప్పులతో బాధ పడేవారికి ఉపశమనం లభిస్తుంది. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. శృంగార సామర్థ్యం పెరగడంతో పాటు.. దీనికి సంబంధించిన సమస్యలు కూడా పోతాయి. ఈ ఆసనం వేయడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ గోరక్షాసనాన్ని క్రమం తప్పకుండా వేస్తూ ఉంటే ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఒత్తిడిని తగ్గించి.. మానసిక ఆనందాన్ని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

మహిళలకు కూడా ఎన్నో ప్రయోజనాలు:

ఇదే ఆసనం స్త్రీలు కూడా వేయవచ్చు. ఆడవాళ్లకు కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గర్బాశయ సమస్యలు ఉంటే పోతాయి. పొట్ట దగ్గర కొవ్వు కరుగడమే కాకుండా.. అక్కడ ఉండే కండరాలు దృఢంగా మారతాయి. జీర్ణాశయంలో ఉండే గ్యాస్ మొత్తం బయటకు పోతుంది. అలాగే మోకాళ్ల నొప్పులతో బాధ పడేవారికి ఇది బాగా ఉపయోగ పడుతుంది. మడమల నొప్పులు, మోకాళ్లు నొప్పులు వంటి వాటిని.. ఈ ఆసనం ద్వారా తగ్గించుకోవచ్చు. అయితే ప్రేగు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ ఆసనానికి దూరంగా ఉంటేనే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.

గోరక్షాసనం ఎలా వేయాలంటే:

ముందుగా నేలపై పద్మాసనంలో కూర్చోవాలి. ఆ తర్వాత రెండు చేతులను రెండు మోకాళ్లపై ఉంచాలి. నెక్ట్స్ పాదాలను రెండింటిని దగ్గరికి తీసుకొచ్చి.. ఒక దానికి ఒకటి అతికించినట్లు పెట్టాలి. ఎడమ చేతితో.. కుడి కాలి మడమను, కుడి చేతితో.. ఎడమ కాలి మడమను పట్టుకోవాలి. ఈ భంగిమ చాలా ఈజీ.. కాబట్టి వీలైనంత సేపు కూర్చోవచ్చు. రోజూ ఇలా కనీసం పది నిమిషాలైన ఈ భంగిమను వేస్తూ ఉంటే ఫలితాలు కనిపిస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి