Poha Pulihora: అటుకులతో ఇలా ఫాస్ట్ గా హెల్దీ బ్రేక్ ఫాస్ట్ చేసుకోండి.. బరువు కూడా తగ్గుతారు!

మనం తీసుకునే ఆహారంలో అటుకులు కూడా ఒకటి. వీటితో చాలా రకాల రెసీపీస్ చేసుకోవచ్చు. అలాగే హెల్దీ కూడా. రోజూ గుప్పెడు అటుకులు తింటే.. ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా అటుకుల్లో ఉండే ఫైబర్.. మల బద్ధకం సమస్యను పోగొడుతుంది. అటుకులతో ఇడ్లీలు, దోశలు, రక రకాలైన స్నాక్స్ వంటివి చాలా చేసుకోవచ్చు. అటుకుల్లో ఫైబర్, పొటాషియం, ఐరన్ వంటికి చాలా మెండుగా ఉంటాయి. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. అటుకులు కొద్దిగా తిన్నా చాలు.. పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు. అలాగే డయాబెటీస్ ఉన్న వారికి అటుకులు..

Poha Pulihora: అటుకులతో ఇలా ఫాస్ట్ గా హెల్దీ బ్రేక్ ఫాస్ట్ చేసుకోండి.. బరువు కూడా తగ్గుతారు!
poha
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Sep 17, 2023 | 9:30 AM

మనం తీసుకునే ఆహారంలో అటుకులు కూడా ఒకటి. వీటితో చాలా రకాల రెసీపీస్ చేసుకోవచ్చు. అలాగే హెల్దీ కూడా. రోజూ గుప్పెడు అటుకులు తింటే.. ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా అటుకుల్లో ఉండే ఫైబర్.. మల బద్ధకం సమస్యను పోగొడుతుంది. అటుకులతో ఇడ్లీలు, దోశలు, రక రకాలైన స్నాక్స్ వంటివి చాలా చేసుకోవచ్చు. అటుకుల్లో ఫైబర్, పొటాషియం, ఐరన్ వంటికి చాలా మెండుగా ఉంటాయి. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. అటుకులు కొద్దిగా తిన్నా చాలు.. పొట్ట నిండిన భావన కలుగుతుంది. దీంతో బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు. అలాగే డయాబెటీస్ ఉన్న వారికి అటుకులు బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇది ఇన్సులిన్ మోతాదును మెరుగైన విధంగా చేస్తుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అటుకులతో అటుకుల పులిహోర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది హెల్దీ కూడా. అలాగే చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఒక్కోసారి ఉదయం టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు.. అటుకులతో ఇలా పులిహోర తయారు చేయవచ్చు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

అటుకులు, పల్లీలు, తాళింపు దినుసులు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ, జీడి పప్పు, అల్లం తరుగు, ఉప్పు, పసుపు, నూనె.

ఇవి కూడా చదవండి

అటుకుల పులిహోర తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని అందులో ఒక సారి అటుకులను ఉంచి.. ఆ తర్వాత గట్టిగా పిండి తీసుకోవాలి. నెక్ట్స్ కళాయిలో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇది వేడెక్కాక పల్లీలు, తాళింపు దినుసులు, అల్లం తరుగు, జీడి పప్పు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కరివే పాకు, సన్నగా తరిగిన ఉల్లి పాయ, పచ్చి మిర్చి వేసుకుని మరొక సారి కలుపుకోవాలి. దీని తర్వాత తడిపి పక్కన పెట్టుకున్న అటుకులను వేసి కలుపుకోవాలి. ఓ ఐదు నిమిషాలు బాగా వేయించుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్ట్స్ నిమ్మరసం వేసుకుని మరొక సారి కలుపుకోవాలి. అంతే ఏంతో టేస్టీగా ఉండే అటుకుల పులిహోర రెడీ. ఎప్పుడూ ఒకటే టిఫిన్ తిని బోర్ కొట్టే వాళ్లు ఇలా వెరైటీగా, టేస్టీగా, హెల్దీగా అటుకులతో బ్రేక్ ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇది వేడి వేడిగా తింటే చాలా బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. టేస్ట్ సూపర్ ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు