Health Tips: టీ, కాఫీలతో ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నారా.. అయితే మీకు ఈ జబ్బులు రావడం గ్యారెంటీ!

ఉదయం లేవగానే టీ, కాఫీ పడనిదే కొంత మందికి ఎలాంటి పని మొదలు కాదు. మరికొంత మందికి బెడ్ టీ తాగుతూంటారు. అయితే ఇలా కనీసం బ్రెష్ కూడా చేయకుండా టీ, కాఫీ తాగకూడదని చెబుతున్నారు నిపుణులు. ఇలా తాగడం వల్ల అజీర్తి, కడుపులో మంట, మలబద్ధకం, జీర్ణ వ్యవస్థ దెబ్బ తినడం వంటి సమస్యలు ఎదురవుతాయట. ఇక సాయంత్రం అయ్యిందంటే చాలు.. చాలా మంది టీ, కాఫీలతో కొన్ని రకాల ఆహార పదార్థాలను తింటారు. మరికొంత మంది టీ తాగే ముందు కానీ.. టీ తాగిన తర్వాత కానీ తింటారు. ఇలా టీ, కాఫీలతో ఆహార పదార్థాలు తీసుకోకూడదట. ఇలా చేసినా కూడా జీర్ణ వ్యవస్థ దెబ్బతినే..

Health Tips: టీ, కాఫీలతో ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నారా.. అయితే మీకు ఈ జబ్బులు రావడం గ్యారెంటీ!
Tea
Follow us
Chinni Enni

|

Updated on: Sep 11, 2023 | 1:53 PM

ఉదయం లేవగానే టీ, కాఫీ పడనిదే కొంత మందికి ఎలాంటి పని మొదలు కాదు. మరికొంత మందికి బెడ్ టీ తాగుతూంటారు. అయితే ఇలా కనీసం బ్రెష్ కూడా చేయకుండా టీ, కాఫీ తాగకూడదని చెబుతున్నారు నిపుణులు. ఇలా తాగడం వల్ల అజీర్తి, కడుపులో మంట, మలబద్ధకం, జీర్ణ వ్యవస్థ దెబ్బ తినడం వంటి సమస్యలు ఎదురవుతాయట. ఇక సాయంత్రం అయ్యిందంటే చాలు.. చాలా మంది టీ, కాఫీలతో కొన్ని రకాల ఆహార పదార్థాలను తింటారు. మరికొంత మంది టీ తాగే ముందు కానీ.. టీ తాగిన తర్వాత కానీ తింటారు. ఇలా టీ, కాఫీలతో ఆహార పదార్థాలు తీసుకోకూడదట. ఇలా చేసినా కూడా జీర్ణ వ్యవస్థ దెబ్బతినే పరిస్థితులు, ప్రేగుల్లో సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటి? వాటి వల్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పిండి వస్తువులు:

పురాతన కాలం నుంచి ఇంటికి గెస్టులు వచ్చినా, పెళ్లిల్లు, ఫంక్షన్స్ లలో.. లేక ఏమైనా తినాలి అనిపించినప్పుడు.. పకోడీలు, బజ్జీలు, బోండాలు ఇలా తినడం అలవాటు. ఇవి తిన్న వెంటనే వేడి వేడి టీ లేదా కాఫీలు తాగుతూంటారు. నూనెలో వేయించిన ఫుడ్స్ ని టీతో పాటు తీసుకుంటే.. ప్రేగుల్లో సమస్యలు తలెత్తుతాయట. ప్రేగు క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

పెరుగుకు సంబంధించిన ఫుడ్స్:

టీ, కాఫీలు తాగేటప్పుడు కానీ.. టీ తాగకు ముందు, తాగిన తర్వాత కానీ పెరుగుతో తయారు చేసిన ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు అని చెబుతున్నారు. పెరుగు మనకు మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. ఆ వెంటనే టీ తాగడం వల్ల ఆ బ్యాక్టీరియా నశిస్తుంది.

పండ్లు:

పండ్లు కూడా టీ, కాఫీలు తాగేటప్పుడు తీసుకోకూడదు. ఫ్రూట్స్ మనకు మంచి పోషకాలను అందిస్తాయి. ఇవి తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఆ వెంటనే టీ తాగితే ఆ పోషకాలన్నీ నశిస్తాయి. గుండెల్లో మంట కూడా వస్తుంది.

నిమ్మ రసం:

నిమ్మరసం కానీ, నిమ్మకాయకు సంబంధించిన ఆహారాలు కానీ టీ, కాఫీలు తాగే ముందు కానీ, తాగిన తర్వాత కానీ తీసుకోకూడదు. కనీసం గంట వరకూ కూడా విటమిన్ సీ ఫుడ్స్ తీసుకోకపోవడం ఉత్తమం. దీని వల్ల కడుపులో నొప్పి, ఉబ్బరం, అజీర్తి, మల బద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఐరన్ ఫుడ్స్:

ఐరన్ కి సంబంధించిన ఫుడ్స్ కూడా టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. లేదంటే మీరు తినే ఆహారంలో ఉన్న ఐరన్ ని శరీరానికి గ్రహించకుండా చేస్తుంది. దీంతో పోషకాలు లోపించి.. రక్త హీనత సమస్య తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఏ పదార్థం తిన్నా తర్వాత వీలైనంత వరకూ టీ, కాఫీలకు దూరంగా ఉంటేనే బెటర్.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?