AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dal Side Effects: హెల్దీ అని రోజూ పప్పు తింటున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే!

పప్పు తింటే ఆరోగ్యంగా ఉంటామని చాలా మంది రోజూ చేసే కూరలతో పాటు పప్పును కూడా చేస్తారు. శాఖాహారులు రోజూ మధ్యాహ్నాం భోజనంలో లేదా రాత్రి భోజనంలో పప్పు ఉండేలా చూసుకుంటారు. సాంబార్, పప్పు టమాటా, పెసర పప్పు, పప్పు ఆకు కూరలు ఇలా ఉండే చూసుకుంటారు. పప్పులో ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ బి వంటి పోషకాలు ఉంటాయి. ఇది మంచి విషయమే అయినప్పటికీ.. రోజూ పప్పు తింటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. డైలీ తిన్నా చాలా తక్కువ మోతాదులో తినాలి. కానీ కొంత మంది మంచిది కదా అని ఎక్కువగా తింటూంటారు. ఇలాంటి వారు తొందరగా అనారోగ్య..

Dal Side Effects: హెల్దీ అని రోజూ పప్పు తింటున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే!
Dal Side Effects
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 17, 2023 | 12:30 PM

Share

పప్పు తింటే ఆరోగ్యంగా ఉంటామని చాలా మంది రోజూ చేసే కూరలతో పాటు పప్పును కూడా చేస్తారు. శాఖాహారులు రోజూ మధ్యాహ్నాం భోజనంలో లేదా రాత్రి భోజనంలో పప్పు ఉండేలా చూసుకుంటారు. సాంబార్, పప్పు టమాటా, పెసర పప్పు, పప్పు ఆకు కూరలు ఇలా ఉండే చూసుకుంటారు. పప్పులో ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ బి వంటి పోషకాలు ఉంటాయి. ఇది మంచి విషయమే అయినప్పటికీ.. రోజూ పప్పు తింటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. డైలీ తిన్నా చాలా తక్కువ మోతాదులో తినాలి. కానీ కొంత మంది మంచిది కదా అని ఎక్కువగా తింటూంటారు. ఇలాంటి వారు తొందరగా అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు.

పోషకాహార లోపం ఎదురవుతుంది:

పప్పు తింటే మంచిదే. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ అదే పనిగా ఎక్కువ మోతాదులో తీసుకుంటే..  పోషకాహార లోపం సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పప్పులో సాధారణంగా పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఇది బాడీలో ఎలక్ట్రోలేట్, సోడియం సమతుల్యతను దెబ్బ తీస్తుంది. అందుకే పప్పును ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.

ఇవి కూడా చదవండి

కిడ్నీలపై ప్రభావం:

పప్పుల్లో ఆక్సలేట్ అనేది ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి పప్పును డైలీ తింటే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే పిత్తాశయంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది.

బరువు తగ్గరు..పెరుగుతారు:

చాలా మంది బరువు తగ్గాలని పప్పును ఎక్కువగా వారి డైలీ ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటారు. నిజానికి మంచి పద్దతే అయినా.. పప్పులో ఉండే కార్బో హైడ్రేట్లు, కేలరీలు వెయిల్ ని పెంచుతాయి.

జీర్ణ వ్యవస్థ దెబ్బ తింటుంది:

పప్పును ఎక్కువగా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బ తింటుంది. పప్పు తిన్నవారిలో చాలా మందికి గ్యాస్ సమస్యను ఎదుర్కొంటారు. దానికి కారణం పప్పులో ఉండే డైటీర ఫైబర్. దీన్ని ఎక్కువగా తింటే అరగదు. కాబట్టి కడుపులో గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి