Kanuga Tree Benefits: చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి బెస్ట్ ఆప్షన్ కానుగ చెట్టు!!

చర్మ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి బెస్ట్ ఆప్షన్ కానుగ చెట్టు అని చెప్పవచ్చు. కానుగ చెట్టులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా కానుగ చెట్టు ఆకులతో, గింజలతో చర్మ సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుందని నిపుణులు కూడా సూచిస్తున్నారు. కానుగ చెట్టును ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తూంటారు. సాధారణంగా వీటిని పార్కుల్లో, ఇంటి బయట, రోడ్ల పక్కన పెంచుతూంటారు. కానుగ చెట్టులో ఎలాంటి ప్రయోజనాలు ఉండవని అనుకుంటారు. కానీ ఈ చెట్టులోని ప్రతి భాగం.. మన ఆరోగ్య సమస్యలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ చెట్టు ఆకులతో..

Kanuga Tree Benefits: చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి బెస్ట్ ఆప్షన్ కానుగ చెట్టు!!
kanuga tree
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 17, 2023 | 1:00 PM

చర్మ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి బెస్ట్ ఆప్షన్ కానుగ చెట్టు అని చెప్పవచ్చు. కానుగ చెట్టులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా కానుగ చెట్టు ఆకులతో, గింజలతో చర్మ సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుందని నిపుణులు కూడా సూచిస్తున్నారు. కానుగ చెట్టును ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తూంటారు. సాధారణంగా వీటిని పార్కుల్లో, ఇంటి బయట, రోడ్ల పక్కన పెంచుతూంటారు. కానుగ చెట్టులో ఎలాంటి ప్రయోజనాలు ఉండవని అనుకుంటారు. కానీ ఈ చెట్టులోని ప్రతి భాగం.. మన ఆరోగ్య సమస్యలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ చెట్టు ఆకులతో అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. కానుగ చెట్టుకును ఉపయోగించడం వల్ల మనం ఏయో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మ సమస్యలు:

– కానుగ చెట్లు గింజల పొడికి, పసుపు కలిసి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని లేపనంగా రాయడం వల్ల గజ్జి, తామర వంటి వ్యాధులు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

– కానుగ చెట్లు గింజల పొడికి, తెల్ల గన్నేరు వేరును పేస్ట్ గా చేసి రాసినా కూడా చర్మ సమస్యలు తగ్గుతాయి.

– కానుగ గింజల నూనెలో వేప నూనె కలిపి రాస్తే దురదలు పోతాయి.

నులి పురుగులు నశిస్తాయి:

కానుగ గింజల పౌడర్ కి, ఇంగువ చేర్చి కలిపి ఉండలా తీసుకుంటే కడుపులో ఉండే పురుగులు నశిస్తాయి.

పిత్త దోషాలను తగ్గిస్తుంది:

కానుగ చెట్ట బెరడు పొడిని రోజూ ఉదయం, సాయంత్రం ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుంటే పిత్త దోషాలు పోతాయి.

బట్టతల సమస్యను నివారిస్తుంది:

బట్టతల సమస్యతో బాధపడేవారికి కానుక చెట్టు పూలు చక్కగా పని చేస్తాయి. కానుగ చెట్టు పూలను పేస్ట్ గా చేసి బట్టతలపై రాస్తే తిరిగి వెంట్రుకలు వస్తాయి.

అలాగే ఆయుర్వేద నిపుణుల సూచనలతో కానుగ చెట్టు భాగాలను వాడితే కంటి చూపుకు సంబంధించిన సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడటంలో కూడా ఉపయోగపడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి