AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakarakaya Karam Podi: డయాబెటీస్ తో బాధపడే వారికి కాకరకాయ కారం పొడి.. కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆహా అనాల్సిందే! రుచితో పాటు ఆరోగ్యం కూడా!

డయాబెటీస్.. ఈ వ్యాధితో బాధ పడేవారి ఇబ్బందిని వర్ణించడం చాలా కష్టం. పెద్దగా ఏమీ తినడానికి ఉండదు.. తాగడానికి ఉండదు. ప్రస్తుతం చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నవారే. షుగర్ ను తగ్గించడంలో కాకరకాయ బాగా పని చేస్తుంది. ఆ కాకరకాయ జ్యూస్ చేసుకుని తాగాలంటే ఎవ్వరికైనా ఇబ్బందే. అలాంటి వారికి ఇలా కాకర కాయ కారం పొడి బాగా హెల్ప్ చేస్తుంది. నోటి రుచిగా.. ఉంటూనే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి ఈ కాకరకాయ పొడి వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది..

Kakarakaya Karam Podi: డయాబెటీస్ తో బాధపడే వారికి కాకరకాయ కారం పొడి.. కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆహా అనాల్సిందే! రుచితో పాటు ఆరోగ్యం కూడా!
Kakarakaya Karam Podi
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 17, 2023 | 1:30 PM

Share

డయాబెటీస్.. ఈ వ్యాధితో బాధ పడేవారి ఇబ్బందిని వర్ణించడం చాలా కష్టం. పెద్దగా ఏమీ తినడానికి ఉండదు.. తాగడానికి ఉండదు. ప్రస్తుతం చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నవారే. షుగర్ ను తగ్గించడంలో కాకరకాయ బాగా పని చేస్తుంది. ఆ కాకరకాయ జ్యూస్ చేసుకుని తాగాలంటే ఎవ్వరికైనా ఇబ్బందే. అలాంటి వారికి ఇలా కాకర కాయ కారం పొడి బాగా హెల్ప్ చేస్తుంది. నోటి రుచిగా.. ఉంటూనే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి ఈ కాకరకాయ పొడి వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తయారు చూద్దాం.

కాకారకాయ పొడికి కావాల్సిన పదార్థాలు:

కాకర కాయలు, చింత పండు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, మినప్పప్పు, ఎండు మిర్చి, శనగ పప్పు, ఉప్పు, నూనె.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం:

ముందుగా కాకర కాయ ముక్కలను శుభ్రంగా కడిగి.. కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకర ముక్కలను నీరు పోయేంత వరకూ వేయించుకుని తీసుకోవాలి. అదే కళాయిలో ఎండు మిర్చి, మినపప్పు, వెల్లుల్లి, శనగ పప్పు, ధనియాలు, జీలకర్ర, చింత పండు కూడా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. వీటన్నింటికీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే కాకర కాయ కారం పొడి రెడీ. ఇది ఓ నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని, ఈ పొడి వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నోరు చప్పగా ఉందని బాధ పడుతున్న షుగర్ వ్యాధి గ్రస్తులకు నోటి రుచిగా ఉంటుంది. కావాల్సిన వాళ్లు వేరు శనగ గుళ్లు కూడా వేయించుకుని ఈ పొడిలో కలుపుకుని తినవచ్చు.

ఈ పొడిని తినడం వల్ల కేవలం టేస్టీనే కాదు.. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులోకి తీసుకొస్తుంది. టైఫాయిడ్, మలేరియా రాకుండా చూస్తుంది. బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను అడ్డుకుంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. అలాగే మల బద్ధకం సమస్య కూడా రాదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి